Trivikram: త్రివిక్రమ్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆదుకోనున్నారా.. ఏమైందంటే?

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఫెయిల్యూర్ మూడ్ లో ఉన్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు త్రివిక్రమ్ అయితే అనుకోని విధంగా సినిమా యావరేజ్ గా నిలిచింది. సిడెడ్,నైజాం, కర్ణాటక, ఓవర్సీస్ లలో బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. మిగిలిన ఏరియాలలో కూడా పెద్దగా హిట్ కొట్టకపోయినా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ ఫలితాలని ఊహించని శ్రీనివాస్ ఇప్పుడు మౌనముద్రని దాల్చారు బయట వాళ్ళని ఎవరినీ పెద్దగా కలవడం లేదు.

 

త్రివిక్రమ్ కి ఇదే పరిస్థితి అజ్ఞాతవాసి సినిమా అప్పుడు కలిగింది. గుంటూరు కారం సినిమా కన్నా ఘోరపరాజయాన్ని పొందింది అజ్ఞాతవాసి. అప్పుడు కూడా త్రివిక్రమ్ దాదాపుగా మౌనముద్రలోకి వెళ్లిపోయి ఒంటరిగా ఉండిపోయారు. తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా తీసి మళ్లీ తన పవర్ చాటుకున్నారు. ఇప్పుడు కూడా ఆ పని చేసే ప్రయత్నంలో ఉన్నారు త్రివిక్రమ్. ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వేసే మనస్తత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్ బాబుని ఎవరు తప్పు పట్టలేదు.

నిజానికి మహేష్ బాబు ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఎటొచ్చి కథలో కొత్తదనం లేకపోవడమే సినిమా హిట్ అవ్వకపోవడానికి కారణం అని త్రివిక్రమ్ పై విమర్శలు కురిపించారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ కి పది అడుగులు ముందుకి వేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తున్నారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

 

హీరో రామ్ తో సినిమా తీయమని నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. స్రవంతి రవి కిషోర్ కి త్రివిక్రమ్ కి మంచి స్నేహబంధం ఉంది కాబట్టి రామ్ తో తీస్తారా లేదంటే విజయ్ దేవరకొండ డేటులు సితార సంస్థ దగ్గర ఉన్నాయి. గౌతమి తిన్ననూరి కోసం ఆ సినిమా చేస్తారా లేదంటే ఎప్పటినుంచో అనుకుంటున్న నానీతో సినిమా చేస్తారా ఇవన్నీ కాకుండా ముందు నుంచి అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ తో సినిమా తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -