Pawan Kalyan: ఏపీలో గందరగోళ పరిస్థితులకు పవన్ కళ్యాణే కారణమా?

Pawan Kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా గందరగోళం పెరిగిపోయింది. రాబోయేఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తుపెట్టుకుంటుంది ? ఏ పార్టీలు ఒంటరిగా పోటీచేస్తాయి అన్న విషయంపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం జనాలకు అర్ధం కావటంలేదు. జనాలకు కాదు కదా కనీసం పార్టీల్లో అయినా క్లారిటి ఉందా అనే అనుమానం పెరిగిపోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత అయోమయం మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తర్వాత గందరగోళం మరింత పెరిగిపోయింది.

ఇంతకాలం టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవటానికి రెడీ అయిపోయాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి అయోమయంలేదు. వస్తే బీజేపీ కూడా కలుస్తుంది లేకపోతే లేదన్న క్లారిటి ఉండేది. అయితే సడెన్ గా అమిత్ తో చంద్రబాబు భేటీ జరగటంతో పొత్తుల విషయంలో ఏమి జరుగుతోందో అర్ధంకావటం లేదు. దీంతో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ పొత్తుకు రెడీ అవుతున్నాయనే ప్రచారాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఇటు చంద్రబాబు అటు బీజేపీ నేతలు ఎవరూ ప్రకటించలేదు. దాంతో ఇద్దరు ఎందుకు కలిసరు అన్నది అర్ధం కాని ప్రశ్న. ఇటువంటి సమయంలో పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టారు.

 

యాత్రలో భాగంగా తాను ఒంటరిగా పోటీచేస్తానో లేకపోతే సమూహంగా పోటీచేస్తానో ఇంకా తేల్చుకోలేదు అని తెలిపారు. అయితే మొన్నటి వరకు టీడీపీతో పొత్తుంటుందని చెప్పిన పవన్ సడెన్ గా ఎందుకు ప్లేట్ ఫిరాయించారో అర్ధంకావటం లేదు. ఒక కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ తనకు బీజేపీ నుండి సహకారం అందదని అన్నారు. వైసీపీ, బీజేపీ మధ్య ఎప్పుడూ సహకారం లేనందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత మాత్రమే. ఇక పొత్తుల విషయాన్ని బీజేపీ నేతల దగ్గర ప్రస్తావిస్తే తమకు జనసేనతో మాత్రమే పొత్తుంటుందని చెబుతున్నారు. సో ఇప్పటికి వైసీపీ మాత్రమే ఒంటరిగా పోటీచేస్తుందని క్లారిటి ఉంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీలు ఏమిచేయబోతున్నాయో అర్ధంకావటంలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -