Mega Compound: మెగా కాంపౌండ్ ను దరిద్రం వెంటాడుతోందా.. వరుస ఫ్లాపుల వెనుక అసలు కారణాలివేనా?

Mega Compound: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. సినిమాల పరంగా మెగా హీరోలది చాలా పెద్ద కాంపౌండ్ అన్న విషయం కూడా తెలిసిందే. అక్కడ సీజన్స్ తో సంబంధం లేదు. ట్రెండ్ తో పని లేదు. మినిమం గ్యాప్ లో ఎవరో ఒకరు హిట్ కొడుతూనే ఉంటారు. వరుసగా ఒక హీరో తర్వాత ఒక హీరో నటించిన సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. నెలలో పది సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అందులో మెగా హీరో నటించిన ఒక్క సినిమా అయినా తప్పకుండా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా ఆ కాంపౌండ్ నిత్యం కళకళలాడుతూ ఉంటుంది.

సీనియర్ హీరో చిరంజీవి నుంచి నిన్నగాక మొన్నొచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు అంతా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటారు. నిత్యం బిజీగా ఉంటారు. అలాగే హిట్ ఫ్లాప్ లు రావడం అన్నది కూడా సహజం. మెగా కాంపౌండ్ నుంచి మినిమం గ్యాప్స్ లో నలుగురు హీరోలొచ్చారు. బాధాకరమైన విషయం ఏంటంటే, నలుగురూ కలిసి మూడు ఫ్లాపులిచ్చారు. దీంతో కాంపౌండ్ కు కాస్త కళ తగ్గింది. సరిగ్గా నెల రోజుల్లో ఈ ఫ్లాపులిన్నీ క్యూ కట్టాయి. జులై చివర్లో బ్రో సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు పవన్ కల్యాణ్. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో మెగా హీరో సాయితేజ్ కూడా నటించాడు. స్వయంగా త్రివిక్రమ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందించాడు.

 

ఇలా భారీ సెటప్ తో, భారీ ఎత్తున రిలీజైన బ్రో సినిమా నిరాశపరిచింది. కంటెంట్ పరంగా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్రో తర్వాత సినిమా వచ్చిన కొద్ది వారాలకే భోళాశంకర్ వచ్చింది. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. బ్రో బాధల్ని భోళాతో మరిచిపోవచ్చని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ భోళా బోల్తాకొట్టింది. మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. తరువాత వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా విడుదల అయ్యి భారీగా డిజాస్టర్ గా నిలిచింది. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాపులు ఎదురు కావడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీంతో మెగా హీరోలకు దరిద్రం చుట్టుకుందా అంటూ నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -