Akhil: ఎన్ని ఫ్లాపులు వచ్చినా అఖిల్ తీరు ఇంతేనా.. ఏం జరిగిందంటే?

Akhil: అక్కినేని వారసుడు అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున రెండవ కుమారుడైన అఖిల్ వి వి నాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

ఆ తర్వాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గానే మిగిలాయి. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది. అంతే కాకుండా ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మొదటి షోకే ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

 

ఇలా ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలలో ఒక్కటి కూడా సరైన హిట్టు అందుకోలేకపోవడంతో అఖిల్ కూడా హీరోగా సరైన గుర్తింపు లభించడం లేదు. ఇదిలా ఉండగా ఇలా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అఖిల్ ఇకనుండి అయిన కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడతారని అందరూ భావిస్తుండగా అఖిల్ మాత్రం పదేపదే చేసిన తప్పు చేస్తూ పోతున్నాడు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ అఖిల్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతుంది.

 

రాధేశ్యామ్‌, సాహో సినిమాలకు పనిచేసిన అనిల్ కుమార్ ను దర్శకుడు పరిచయం చేస్తూ అఖిల్ హీరోగా ‘ ధీర ‘ అనే సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిఫ్ట్‌ వర్క్ జరుగుతోంది. అయితే ఇది కూడా భారీ బడ్జెట్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.లవర్ బాయ్ గా ప్రేక్షకులలో అఖిల్ కి మంచి స్థానం ఉంది. అయితే అఖిల్ మాత్రం లవ్ స్టోరీస్ తీయకుండా ఇలా యాక్షన్ సినిమాలో పాన్ ఇండియా అంటూ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు . దీంతో అఖిల్ జీవితంలో స్టార్ట్ హీరోగా ఎదగలేడని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -