Allu Sirish: అల్లు వారింట పెళ్లి భాజలు మోగనున్నాయా… శిరీష్ మాటలకు అర్థం అదేనా?

Mega Heros: తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున పోటీపడుతూ సినిమాలలో నటిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మరికొందరు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో గుర్తింపు పొందారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో అల్లు శిరీష్ ఒకరు.

అల్లు శిరీష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలలో నటించారు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గుర్తింపు పొందడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.

అల్లు అరవింద్ సమర్పణలో విడుదల కానున్న ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజమండ్రిలో పర్యటించిన అల్లు శిరీష్ కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా అభిమానులు అల్లు శిరీష్ ను ప్రశ్నిస్తూ మెగా హీరోలు అందరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అంటూ తమ కోరికను బయటపెట్టారు.

ఈ ప్రశ్నకు అల్లు శిరీష సమాధానం చెబుతూ అదే కనుక జరిగితే అందరికన్నా ముందు సంతోషించే వారిలో నేను ముందు ఉంటాను అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ తెలిపారు.ఇక త్వరలోనే తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్లి సందర్భంగా మెగా హీరోలు అందరూ కూడా ఒకే చోట కలవబోతున్నారంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ పెళ్లి గురించి హింట్ ఇవ్వడంతో ఎంతో మంది అభిమానులు త్వరలోనే అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -