Rajamouli: జూనియర్ ఎన్టీఆర్ వల్లే రాజమౌళి ఈ స్థాయిలో ఉన్నారా?

Rajamouli: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు. తన సహజమైన నటనతో అందరిని కూడా ఆకట్టుకున్న ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఘన విజయం సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 

సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చారు. రాజమౌళి కొత్త డైరెక్టర్ అయినా స్టూడెంట్ నంబర్1 సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ నమ్మి రాజమౌళికి ఛాన్స్ ఇచ్చారు. అదృష్టవశాత్తూ ఈ సినిమా సక్సెస్ సాధించింది. అయితే స్టూడెంట్ నంబర్1 హిట్టైనా రాజమౌళికి సులువుగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో సింహాద్రి రూపంలో తారక్ మరో ఛాన్స్ ఇచ్చారు. ఒక విధంగా రాజమౌళి కెరీర్ కు తారక్ హెల్ప్ చేశారనే చెప్పాలి.

 

ఇక్కడ మరో విషయం ఏంటంటే రాజమౌళి సినీ ఇండస్ట్రీలో అంత స్థాయికి రావడానికి తారక్ ఒకరకంగా కారణమని చెప్పాలి. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా భీమ్ అంతటి భారీ స్థాయి క్యారెక్టర్ కు మరే ఆర్టిస్టు సరిపోరు. ఆ పాత్రకు ఎన్టీఆర్ చేయడమే కరెక్ట్. ఆ సినిమా మొత్తానికి తారక్ కు ఎక్కువ మార్కులు పడ్డాయనే చెప్పాలి. తన నటనతో తారక్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. సింహాద్రి, రాఖీ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో ఆయన నటించిన తీరు అద్భుతం అనే చెప్పాలి.

 

బాలరామయణంలో ఎన్టీఆర్ బాలనటుడిగా కనిపించినా ఆ తర్వాత రాజమౌళి సీరియల్ చేస్తున్న సమయంలో కాస్తో కూస్తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ అప్పటి నుంచే ఉండటంతో ఇక రాజమౌళి తారక్ ను వదిలిపెట్టలేదు. తారక్ తో ఇప్పటికీ నాలుగు సినిమాలు చేశారు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు తారక్, రాజమౌళి కాంబోలో వచ్చాయి. ఒక రకంగా రాజమౌళిని బిగ్ డైరెక్టర్ నిలబెట్టడానికి తారక్ సినిమాలు చాలా ప్లస్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -