YS Jagan: ఎన్నికల సమయంలో తారక్ నిర్ణయాలివే .. జగన్ కు అలా బిగ్ షాక్ తగలబోతుందా?

YS Jagan: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కోడ్ రిలీజ్ అయిన తర్వాత పార్టీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీల సీట్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. అయితే ఏపీలో ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తుంది. ప్రస్తావన రాకపోయినా.. వైసీపీ ఆ ప్రస్తావన తీసుకొని వస్తుంది. టీడీపీని డ్యామేజ్ చేయడానికి వైసీపీ చేసే ప్రయత్నాల్లో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం కూడా ఒకటి. టీడీపీలో, కూటమిలో వివాదాలు సృష్టించడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది. జనసేనతో టీడీపీ పొత్తు లేకుండా చేయడానికి వైసీపీ శతవిధాల ప్రయత్నించింది. అయితే.. ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరికి జనసేనకు కేవలం 21 సీట్లు మాత్రమే కేటాయించడాన్ని కూడా బాగా ప్రచారం చేసి జనసైనికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ.. పవన్ తన కార్యకర్తలకు ఏదోలా నచ్చజెప్పారు. తర్వాత బీజేపీతో టీడీపీ కలవకుండా ఉండటానికి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరిగింది. అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

చివరికి ఎన్టీఆర్ అస్త్రాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. నిజానికి ఈ ఎన్టీఆర్ ప్రస్తావన వైసీపీ కొత్తగా తీసుకొచ్చింది కాదు. చంద్రబాబుతో.. ఎన్టీఆర్ కు ఉన్న గ్యాప్ ను క్యాచ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన కదలిరా సభలో కూడా ఎన్టీఆర్, టీడీపీ ఫ్యాన్స్ మధ్య వివాదాలు సృష్టించడానికి ప్రయత్నించారు. ఎన్టీఆర్ ను వైసీపీ చివరి అస్త్రంగా అనుకుంది. కానీ.. అది కూడా వర్క్ అవుట్ అయ్యేలా లేదు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకొనిరావాలని అనుకున్నారు. ఎన్టీఆర్ టీడీపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటే టీడీపీకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. 2009లో ఎన్టీఆర్ టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. సుమారు 100కు పైగా ప్రసంగాలు ఇచ్చారు. ఎన్టీఆర్ సభలకు అప్పట్లో జనం తండోపతండాలుగా వచ్చేవారు. 2004లో టీడీపీ 47 స్థానాలకే పరిమితం అయింది. కానీ, 2009లో ఎన్టీఆర్ ప్రచారం చేసినపుడు ఆ పార్టీ 92 స్థానాల్లో గెలుచుకుంది. పైగా అదేటైంలో ప్రజారాజ్యం పార్టీ కూడా కొత్త ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది. అలాంటి సమయంలో 92 స్థానాలు గెలుచుకుంది అంటే.. ఎన్టీఆర్ రీజన్ చాలా మంది అభిప్రాయం.

అయితే.. ఆ తర్వాత నారా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి గ్యాప్ పెరిగింది. భువనేశ్వరిపై వైసీపీ నేతలు అసెంబ్లీలో తప్పుగా మాట్లాడినపుడు కూడా ఎన్టీఆర్ పెద్దగా రెస్పాండ్ కాలేదు. కర్ర విరగకూడదు. పాము చావ కూడదు అన్నట్టు వ్యవహరించారు. చంద్రబాబు అరెస్ట్ పై అసలు స్పందించలేదు. దీంతో ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటారని వైసీపీ భావించింది. కానీ, ఎన్టీఆర్ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో కల్యాణ్ రామ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీలో ఈసారి మీ పాత్ర ఉంటుందా? అని మీడియా ప్రశ్నించగా.. తారక్ తో మాట్లాడి దీనిపై స్పందిస్తానని అన్నారు. దీంతోపాటు.. తారక్, నేను సినిమాల్లో చాలా బిజీగా ఉన్నామని కూడా చెప్పారు. రాజకీయాల గురించి ఆలోచించే టైం లేదన అన్నారు. అంటే.. ఎన్టీఆర్ సైలంట్ గా ఉంటారని అర్థం అయిపోయింది. టీడీపీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం లేదు. వైసీపీ ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -