Vizag Swetha: శ్వేత చనిపోవడానికి ఆ భూమి కారణమా.. అసలేం జరిగిందంటే?

Vizag Swetha: ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన కేసు శ్వేత ఆత్మహత్య. ముందు మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసు తర్వాత అనుమానాస్పద మృతి కేసుగా మారింది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరికి ఆత్మహత్య అని తేల్చి చెప్పారు విశాఖపట్నం సి పి త్రివిక్రమ్ వర్మ.

ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం అంతా వీడియోగ్రఫీ చేయించామని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్ వర్మ. అయితే ఆమెపై అత్తింటి వేధింపులు నిజమే అని తమ విచారణలో తేలిందని చెప్పారు. ఆమె భర్త మణికంఠ, ఆమె పేరు మీద ఉన్న 90 సెంట్ల భూమిని తన పేరు మీదికి మార్చమంటూ ఒత్తిడి చేసేవారని తమ విచారణలో తెలిసిందని చెప్పారు త్రివిక్రమ్ వర్మ.

 

శ్వేత తల్లి ఎదురుగానే దంపతులిద్దరూ గొడవపడే వారని, మణికంఠ శ్వేతని నిర్లక్ష్యం చేసేవాడని అందుకే శ్వేత అత్తింటి వారితో పాటు ఆడపడుచు భర్త మీద కూడా కేసు పెట్టారు శ్వేత తల్లి. ఇదే కారణాలతో ఇంతకుముందు కూడా శ్వేత ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు సీపీ త్రివిక్రమ్ వర్మ.

 

శ్వేత కనిపించడం లేదంటూ అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే బీచ్ లో దొరికిన శవాన్ని శ్వేత డెడ్ బాడీ గా గుర్తించిన పోలీసులు అది హత్య, ఆత్మహత్య అని తెలియక తలలు పట్టుకున్న సంగతి తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని శ్వేత బంధువులకు అప్పగించారు పోలీసులు.

 

శ్వేత ఇంటి చుట్టుపక్కల వారు కూడా శ్వేత అత్తింటి వారికి వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఈ కేసు గురించి స్పందించిన సీపీ త్రివిక్రమ్ వర్మ.. విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఎంతో ఉత్కంఠను రేపిన ఈ కేసు ముందు ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడవలసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -