Vizag Swetha: అయ్యో పాపం శ్వేత.. సీతకు మించిన కష్టాలను అనుభవించిందా?

Vizag Swetha: వైజాగ్ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన శ్వేత మృతి కేసులో రోజుకొక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది గాజువాకకు చెందిన మణికంఠ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న శ్వేత ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయితే ఇంట్లో గొడవల కారణంగా ఈమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఈమె మరణం గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే శ్వేతా కాల్ రికార్డ్ , పోస్టుమార్టం రిపోర్ట్స్ కీలకంగా మారాయి.

శ్వేత తల్లి రమాదేవి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెళ్లి అయినా నెల రోజులకి నా కుమార్తెకు అత్తమామలతో వేధింపులు మొదలయ్యాయని భర్త కూడా వేధింపులకు గురి చేశారని శ్వేత తల్లి ఫిర్యాదు చేశారు. అత్త ఇంటి వేధింపులు కారణంగానే తన కుమార్తె మరణించింది అని,గత నెల రోజుల క్రితం కూడా తన అల్లుడు తన కుమార్తెకు విడాకులు ఇస్తానని తనతో గొడవ పడ్డారని రమాదేవి పోలీస్ స్టేషన్లో తన బాధను తెలియజేశారు.

 

చిన్నప్పుడే భర్తను కోల్పోయి ఉన్న ఒక్క కూతురిని ఎంతో కారాబంగా పెంచి పెళ్లి చేస్తే అత్త ఇంటి వారు చిత్రహింసలకు గురి చేస్తూ తన కూతురిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు సివిల్స్ కి ప్రిపేర్ అవుతుందని తనకు ఇంటి పనులన్నీ చెబుతూ కొట్టు చాకరి చేయించేవారని కనీసం తనని బయటకు కూడా పంపించేవారు కాదు అని తెలిపారు. ఇక తన భర్త కూడా తన తల్లిదండ్రులు చెప్పిన విధంగానే వినాలని తనకు చెప్పారు.

 

చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన భర్తకు ఫోన్ చేసి తన భర్తతో గొడవ పడిందని తెలిపారు. ఇక ఈమె చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసి కూడా చనిపోయారు. నేను ఏం చెప్పిన నువ్వు వినవు.. నేను లేకుండా నువ్వు బతకగలవు.. నేను చెప్పిన చెప్పకపోయినా అన్ని నీకు తెలుసు ఆల్ ద బెస్ట్ యువర్ ఫీచర్ అంటూ ఈమె సూసైడ్ లెటర్ రాసి మరి వెళ్ళిపోయారు. ఇలా వెళ్లిపోయిన ఈమె బీచ్ లో శవమై కనిపించారు. అయితే ఈమె మరణానికి అత్తింటివారే కారణం అని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -