Vizag Swetha: శ్వేత అలాంటి టార్చర్ ను అనుభవించిందా.. అసలేమైందంటే?

Vizag Swetha: విశాఖ బీచ్ లో అర్ధ నగ్నంగా పడి ఉన్నటువంటి శ్వేత అనే వివాహిత మృతి కేసు ఆంధ్రప్రదేశ్లో సంచలనగా మారింది.ఈ కేసు గురించి రోజుకొక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.అత్తవారింట్లో గొడవ జరగడంతో ఈమె ఇంటి నుంచి వెళ్ళిపోయి మరుసటి రోజు బీచ్ లో శవం గా కనిపించడంతో అసలు ఈమె మృతికి గల కారణాలు ఏంటి అసలు ఈమెది ఆత్మహత్యనా లేక హత్యనా అన్న కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్వేత అత్తింటి వేధింపుల కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుని చనిపోయింది అంటూ శ్వేత తల్లి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా శ్వేత తల్లి మాట్లాడుతూ …నా భర్త చనిపోయిన తర్వాత నా కూతుర్ని చాలా అపురూపంగా చూసుకున్నాను. గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీ మణికంఠ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు తన కూతురితో వివాహం చేశానని తెలియజేశారు.అయితే పెళ్లయిన కొద్ది రోజుల నుంచి తనకు తన అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయని ఆ విషయాలన్నింటినీ తన కూతురు తనతో చెప్పుకొని బాధపడేదని శ్వేత తల్లి తెలియజేశారు.

 

తన భర్తను ఎంతగానో ప్రేమించింది..ఇదే విషయమే తనకు ఫోన్ చేసి నేను తనని ఎంతో ప్రేమిస్తున్న తను నన్ను దూరం పెడుతున్నాడు అమ్మ నాకు నా మనీ కావాలి అంటూ బాధపడేదని తెలిపారు.తాను ఎంతసేపు ఉన్న తన అక్క చెల్లెలు అమ్మానాన్నల మాట వినేవాడని భార్యను దూరం పెడుతూ వచ్చేవారని శ్వేతా తల్లి తెలిపింది. ఇలా భర్త తనతో సరిగా మాట్లాడకపోవడమే కాకుండా తనతో తరచూ గొడవ పడటంతో ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిందని రమాదేవి తెలిపారు.

 

మంగళవారం శ్వేత తన ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో కూడా తన భర్తకు ఫోన్ చేసిందని అయితే ఆ సమయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడం వల్లే తాను సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని తెలిపారు. అయితే తన భర్తతో ఏం మాట్లాడింది ఎలాంటి గొడవ జరిగిందనే విషయం తెలియకపోయినా తాను తీవ్రమైన మనస్థాపానికి గురై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, అత్తింటి వేధింపులే అందుకు కారణం అంటూ ఈ సందర్భంగా శ్వేత తల్లి తన కూతురి కష్టాలను చెబుతూ కన్నీటి పర్యంతరం అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -