Commissioner Dog: కమిషనర్ కుక్కంటే ఇంత ప్రేమా.. పోలీసుల పరువు తీస్తున్నారుగా?

Commissioner Dog: ఈ మధ్యకాలంలో అధికారులు తమ అధికారాన్ని విచ్చల విడిగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇరిగేషన్ ఇంజనీర్ తన ఫోన్ ని కాలువలో పోగొట్టుకుంటున్నారు. తన ఫోన్ ఏదో బంగారం అన్నట్లు కొన్ని వేల లీటర్ల నీటిని తోడించారు. ఇలానే ఓ పోలీసు అధికారి తన కుక్క పోయిందని వందల ఇళ్లని వెతికించారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

పోలీసులపై నిత్యం ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటుంది. కారణం ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తులు పరిధికి మించి వ్యవహరించటమే. వ్యక్తిగతంగా తమ హోదాని దుర్వినియోగం చేయటం ఒక ఎత్తు అయితే, అధికారాన్ని ఉపయోగించి అమాకులపై తమ జూలం ప్రదర్శిస్తుంటారు. దీనిపై అనేకమార్లు దొబ్బులు తిన్న సందర్భాలు ఉన్నాయి. తాజా ఓ ఉన్నతాధికారి తన కుక్కకోసం ఏకంగా వందల మంది పోలీసులకి పనిపెట్టినట్లు తెలిసింది.

ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ పోలీస్ కమిషనర్ సెల్వ కుమారి పెంచుకునే పెంపుడు శునకం తప్పిపోయింది. ఈ కుక్క ఆ వ్యక్తికి కావటం ఒక ఎత్తు అయితే, ఆ కుక్క కూడా మాములు కుక్క కాదు. జర్మన్ షెపర్డ్ జాతికి చెందినది. దాని పేరు ఎకో. ఆ జాతికి చెందిన కుక్క లు నగరంలో 19 మాత్రమే ఉన్నాయట. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ శునకం తప్పిపోయింది.

 

ఇక ఇది పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. పోలీసు సిబ్బంది హుటాహుటిన కమిషనర్ నివాసానికి వెళ్లి ఆ ప్రాంతంలోని 500లకు పైగా ఇళ్లను వెతికారు. జంతువుల సంరక్షణాధికారి సైతం కమిషనర్ ఇంటికి చేరుకుని, కుక్క ఫొటోను తీసుకుని వెతికారట. దీంతో ఈ ఘటన పెద్ద వివాదాస్పదం అయ్యింది.

 

కమిషనర్ మాత్రం మరోలా చెబుతున్నారు. తమ శునకం కోసం పోలీసులు వెతకలేదని చెప్పుకొచ్చారు. తప్పిపోయిన నా పెంపుడు కుక్క గురించి కొన్ని కథనాలు వస్తున్నా యి. గేట్ తెరచి ఉండటంతో అది బయటికి వెళ్లిపోయింది. మా నివాసానికి సమీపంలోనే అది తిరగడాన్ని గమనించిన కొందరు దాన్ని తిరిగి మా ఇంటికి తీసుకువచ్చారన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -