Niharika Konidela: హీరోయిన్ నిహారిక తాయత్తు ధరించడం వెనుక ఇంత కథ ఉందా?

Niharika Konidela: ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నిహారిక పేరు కూడా ఒకటి. తరచూ ఏదో ఒక విషయంతో నిహారిక పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే నిహారిక చాలా గ్యాప్ తర్వాత తాజాగా నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్. ఈ వెబ్ సిరీస్ మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిహారిక ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది.

ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు నిహారిక తన భర్త చైతన్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ నిహారిక ఆ విషయం గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి మెల్లగా నవ్వుతూనే తప్పించుకుంటోంది. దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా నిహారిక మాత్రం అలాంటివి పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది. ఇది ఇలా ఉంటే నిహారిక మరో సరికొత్త ప్రాజెక్టుని తెరపైకి తీసుకురాబోతోంది.

 

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటూ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన నిహారిక తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెల్తోంది. తాజాగా మదర్స్ డే సందర్భంగాకొత్త సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను మొదలుపెట్టింది. మదర్స్ డే కానుకగా వాళ్ళ అమ్మ గారితో ఈ పూజ కార్యక్రమాలను చేయించింది. కాగ ఈ పూజా కార్యక్రమానికి నిహారిక చాలా హైలెట్గా కనిపించింది. చాలా స్లిమ్ గా వైట్ శారీతో రెడ్ డాట్స్ తో రెడ్ స్లీవ్ లెస్ బ్లౌస్ తో సూపర్ హాట్ గా కనిపించింది. అంతేకాదు ఆక్సిడైజ్డ్ జ్యూవెలరి వేసి మెడలో తాయత్తులా ఉండే దండతో కనిపించింది. దీంతో నిహారిక ఇలాంటివి కూడా నమ్ముతుందా?అంటూ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నిహారిక హిట్ ట్రాక్ పడడానికి పూజలు చేయించుకుని తాయత్తు వేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున వార్తలను సృష్టి స్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -