Tollywood: టాలీవుడ్ భారీ సినిమాలు ఫ్లాప్ కావడం వెనుక ఇంత కథ ఉందా?

Tollywood: ఒక సినిమా సక్సెస్ సాధించాలి అంటే డైరెక్టర్ హీరో హీరోయిన్లు నటీనటులు అందరూ బాగా కష్టపడాలి. దానికి తోడు అన్నిటికంటే మించి మంచి కథ ఉండాలి. మంచి కథ తీసుకుని దానికి తగ్గట్టుగా కష్టపడితే సినిమా సక్సెస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేనా అంటే అంతే కాదండోయ్ ఇంకా ఉంది. కథలో ఉండే ఆత్మ చెడిపోకుండా దానిని వెండితెరపై మాధ్యమంగా చెప్పగలగాలి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లోపం ఇదే అని చెప్పవచ్చు. ఈ లోపం కారణంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.

సినిమాలోని ఆత్మను మిస్ చేస్తున్నారు. ఇతర హంగు ఆర్భాటాల మీదనే దృష్టి పెడుతున్నారు. ఎంతసేపు హీరో హీరోయిన్ ల రెమ్యూనరేషన్, గ్రాఫిక్స్ మ్యూజిక్ ఐటమ్ సాంగులు, ఫైట్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు తప్ప అసలు విషయంపై ఫోకస్ చేయడం లేదు. సినిమా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు చాలా తరచుగా ఒక మాట చెబుతూ ఉండేవారు. కథ చూసి ఈ సినిమా హిట్టవుతుంది, ఈ సినిమా ఫ్లాపవుతుంది అని తేల్చి చెప్పగల మేధావులు, జ్యోతిష్యులు ఎవరైనా ఉంటే వారికే నాలుగైదు కోట్లు ఇచ్చేద్దాం ఆ ఫలితమైతే గ్యారంటీ కదా అంటుండేవారు..

 

ఆ మాట అక్షరాల నిజమే. ఒక సినిమా సక్సెస్ అవుతుందా లేదా? అనే సంగతి ఏ దశలో చెప్పడం సాధ్యం అవుతుంది? ఈ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. స్క్రిప్టు చూసి, కథ లైను విని ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పడం కేవలం ఒక ఆశ మాత్రమే. ఎందుకంటే సినిమా అనేది ఒక టీమ్ వర్క్. 24 క్రాఫ్ట్ లను సరైన తూకంతో మేళవిస్తేనే అది సినిమా అనిపించుకుంటుంది. అసలు సినిమాలో ఆత్మ అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే.. పెద్దఖర్చు గానీ, వంచన గానీ లేకుండానే కొన్ని సినిమాలు అత్యద్భుతంగా ఆడుతున్నాయి. సినిమా అంటే ఎమోషన్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అందరూ గుర్తుంచుకోవాలి. ఖర్మం ఏంటంటే ఈ సంగతి తెలియకుండా సినిమా అంటే ఫార్ములా అని నమ్మే అపరిపక్వ అజ్ఞానులు టాలీవుడ్‌లో మేకర్లుగా కూడా చెలామణీ అవుతున్నారు. సినిమా అంటే ఫార్ములా అని నమ్మే వాళ్లు కథను వంట వండినట్టే వండడం ప్రారంభిస్తారు. కామెడీని, యాక్షన్, సెంటిమెంట్లను ఉప్పూ మసాలా కలిపినట్టుగా కలుపుతారు.

 

ఎప్పుడైనా క్లిక్ కావొచ్చు. కానీ ఆ వంట చాలా సందర్భాలలో సినిమా పతనానికి దారితీస్తూ ఉంటుంది.సినిమా అంటే ఎమోషన్ అని నమ్మడం ముఖ్యం. ఎమోషన్ అంటే ఏడిపించడం అనుకుంటే భ్రమ. అది కేవలం ఒక భావోద్వేగం. నవరసాల్లో ఏదైనా సరే సినిమాను కీలకంగా నడిపించే ఎమోషన్ కావొచ్చు. దర్శకుడు ముందు ఆ ఎమోషన్ ను నమ్మాలి. కథలోని ప్రతి సన్నివేశాన్ని ఆ ఎమోషన్ చుట్టూతానే వండుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -