Villain: ఈ ప్రముఖ విలన్ సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా?

Villain: ఒక సినిమాలో హీరో, హీరోయిన్లే కాదు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. అందులోనూ విలన్స్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. కొన్ని సినిమాల విషయానికి వస్తే విలన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కూడా నిలుస్తారు. ఒక్కోసారి ఈ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా మెయిన్ రోల్స్ చేసే వారి పక్కనుండే వారు కూడా ఫేమస్ అవుతుంటారు. ఆ కోవకు చెందిన నటుడే షేక్ శ్రీను.

షేక్ శ్రీను విలన్ల పక్కన సైడ్ విలన్ గా సినిమాల్లో నటిస్తుంటాడు. ఆయన పేరు ఇండస్ట్రీలో అంతగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఫోటో చూస్తే మాత్రం గుర్తు పట్టేవారు ఉన్నారు. షేక్ శ్రీను నటనతోనే కాకుండా తన బాడీతో కూడా అందర్నీ అట్రాక్ట్ చేశాడు. అలాంటి శ్రీను బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోక ఉండరు. షేక్ శీనుకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. బాడీ బిల్డింగ్ లో ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

చిన్నప్పటి నుంచీ ఆయనకు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అట. ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చినట్లు పలుసార్లు చెప్పారు. ఇకపోతే జాకీచాన్, హీరో అర్జున్ లను చూశాక సినిమాలో ఎలాగైనా విలన్ గా నటించాలని బలంగా నిశ్చయించుకున్నారట. దీంతో సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్ సాయంతో ఎంట్రీ ఇచ్చానని శీను చెప్పుకొచ్చాడు.

బాలయ్య హీరోగా నరసింహ నాయుడు సినిమాలో మొదటిసారిగా షేక్ శ్రీను నటించారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ దృష్టిలో పడ్డ శ్రీను, అప్పటి నుంచి సినిమాల్లో అవకాశాలు రావడంతో కంటిన్యూ చేస్తూ కెరీర్ ను ముందుకు నడిపారు. షేక్ శ్రీను అసలు పేరు షేక్ రెహమాన్. ఈయన ఇప్పటి వరకూ భద్ర, జయ జానకి నాయక, ఆప్తుడు, మిర్చి వంటి సినిమాల్లో కనిపించారు. అయితే షేక్ శ్రీను వైజాగ్ లో పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తూనే ఇలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -