TDP-BJP: బీజేపీతో టీడీపీ పొత్తు కన్ఫార్మ్? ముహూర్తం అప్పుడే?

TDP-BJP: ఏపీ ప్రతిపక్ష టీడీపీ మళ్లీ ఎన్డీయేలో చేరనుందని ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంచలన కథనం ప్రచురించింది. తిరిగి ఎన్డీయేలో చేరేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇప్పటికే మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు భేటీ అయి మాట్లాడినట్లు తన కథనంలో తెలిపింది. అంతేకాదు ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా బీజేపీ-టీడీపీ పొత్తు అంశంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి లోకేష్ తో మాట్లాడినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు ఖాయమని, ఇప్పటికే డీల్ కూడా కుదిరిట్లు తన కథనంలో పేర్కొంది. వైసీపీని క్రమక్రమంగా దూరం చేసుకుంటూ టీడీపీని దగ్గర చేసుకునేందుకు కమళదళం ప్రయత్నాలు చేస్తోందని చెప్పింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి గత కారణాలను కూడా ఇందులో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది.

టీడీపీతో బలపడటం ద్వారా ఏపీలో బీజేపీకి బలం పెరుగుతుందని ఆ పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో 5 శాతం ఓట్ల బ్యాంక్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా అంచనా వేసిన బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టకుంటే సీట్ల శాతం 7 వరకు పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తుంది. అంతేకాకుండా టీడీపీతో జతకడితే రెండు,మూడు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లు రెండు వరకు గెలుచుకునే అవకాశముందని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లోక్ సభ సీట్లు తగ్గాయని, గత ఎన్నికల్లో వచ్చే సీట్ల కంటే సీట్లు భారీగా తగ్గుతాయని ఇటీవల పలు జాతీయ మీడియా సర్వేలలో తేలింది. దీంతో ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కాకపోయినా లోక్ సభ సీట్ల పరంగా లాభం పొందవచ్చనే ఆలోచన బీజేపీ చేసినట్లు చెబుతున్నారు. అతంతేకాకుండా ఇప్పటికే చాలా పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లాయి. శివసేనతో పాటు అకాలీదళ్ తో పాటు ఇటీవల బీహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఆర్జేడీ కూడా ఎన్టీయేకు షాక్ ఇచ్చింది. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన నితీష్ కుమార్.. ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొస్తానంటూ ప్రకటంచారు.

ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో అనుభం ఉన్న చంద్రబాబును దగ్గర చేసుకుంటే లాభం జరుగుతుందని కమలం నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీని మళ్లీ దగ్గర చేసుకునేందుకు భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహా ఆవిష్కరణకు టీడీపీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అంతేకాకుండా ఢిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి చంద్రబాబును కేంద్రం ఆహ్వానించింది. దీనిని బట్టి చూస్తే టీడీపీ పట్ల మోదీ సానుకూలంగా ఉన్నట్లు అర్ధమవుతుంది.

గతంలో రెండుసార్లు ఎన్డీయేలో టీడీపీ చేరింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మూడేళ్లకే టీడీపీ, బీజేపీ మధ్య గ్యాపె పెరిగింది. విభజన హామీలు నెరవేర్చని బీజేపీతో ఎలా పొత్తులో ఉంటారని వైసీపీ ప్రశ్నిస్తూ ఇరుకున పెట్టింది. దీంతో వైసీపీ ట్రాప్ లో పడి ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో.. బీజేపీకి వైసీపీ దగ్గర అయింది. బీజేపీ సపోర్ట్ గత ఎన్నికల్లో జగన్ అ ధికారంలోకి రావడానికి ఎంతోకోంత ఉపయోగపడింది. కానీ జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల వైసీపీపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తుకు రెడీ అవ్వడంతో.. మోదీ కూడా ఓకే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దసరా లేదా దీపావళి నాటికి దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -