Nidhhi Agerwal: సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుతోందా.. అవి చూపించాల్సిందేనా?

Nidhhi Agerwal: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచంలో అవకాశాలను అందుకొని ముందుకు కొనసాగాలి అంటే టాలెంట్ మాత్రమే కాదు గ్లామర్ షో చేయడం కూడా అవసరమని ఇదివరకు ఎంతో మంది హీరోయిన్లు చెప్పేవారు.ఇండస్ట్రీలో గ్లామర్ షో చేస్తేనే వారికి అవకాశాలు వస్తాయని లేకపోతే అవకాశాలు రావు అంటూ పలువురు ఈ విషయం గురించి తెలిపారు.

ఇకపోతే గ్లామర్ షో చేయకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ కూడా ఇండస్ట్రీలో అగ్రతారాలుగా వెలుగొందుతూ వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి సెలెబ్రెటీలు కూడా ఉన్నారు.ఇలాంటి కోవకు చెందిన వారిలో నటి సాయి పల్లవి కీర్తి సురేష్ వంటి వారిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు గ్లామర్ పైనే ఉందని,గ్లామర్ షో చేయకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అంటూ కొందరు భావిస్తున్నారు.

ఇక ఇదే విషయం గురించి నటి నిధి అగర్వాల్ ను ప్రశ్నించగా ఆమె షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే మన అందాలను దాచుకుంటే అవకాశాలు రావని ఎక్స్ ఫోజ్ చేస్తేనే అవకాశాలు వస్తాయి అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు.ప్రస్తుత జనరేషన్ టాలెంట్ ను కాకుండా హీరోయిన్స్ అందాలను వారి గ్లామర్ వైపే వారి చూపు ఉందని, అందుకే టాలెంట్ ను కాకుండా గ్లామర్ షోకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు వస్తున్నాయని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి గ్లామర్ షో చేయకపోతే మనల్ని ఎవరూ చూడరు, కనీసం దర్శకులు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వరు. సీన్ కి అనుగుణంగా మనం డ్రెస్ వేసుకొని గ్లామర్ షో చేసినపుడే అవకాశాలు వస్తాయి, ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగవచ్చు అంటూ ఈ సందర్భంగా నిధి అగర్వాల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -