Pawankalyan: హరిహర వీరమల్లులో డూప్ పవన్ కళ్యాణ్.. షాకవుతున్న ఫ్యాన్స్?

Pawankalyan: టాలీవుడ్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు సినీ లోకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా తిరుగులేని అభిమానాన్ని సంపాదించాడు. పవన్ సినిమా అంటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంటుంది.

 

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయింది. పవన్ కళ్యాణ్ ఓ పక్కన సినిమాలు చేస్తూనే, మరోపక్క రాజకీయాలు చేస్తున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ సినిమాల కన్నా రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. దీంతో సినిమాల విషయంలో ఇబ్బందికర స్థితి ఏర్పడింది.

 

డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి ఎక్కువ సీన్లను పవన్ కళ్యాణ్ లేకుండా, ఆయన డూప్ తో షూట్ చేస్తున్నారని సమాచారం. నిజానికి లాంగ్ షాట్లు, అవసరమైన షాట్లు మినహా మిగిలిన చోట్ల డూప్ లను ఎక్కువగా వాడరు. కానీ క్రిష్ కు తప్పనిసరి స్థితిలో డూప్ ను అతిగా వాడేస్తున్నాడట.

 

సినిమాలో రియల్ హీరో కన్నా డూప్ తో ఎక్కువ సీన్లు చేస్తే.. సినిమా రిజల్ట్స్ విషయంలో తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ చేసిన ‘రాధేశ్యామ్’లో కొన్ని సీన్లలో డార్లింగ్ డూప్ ను వాడటం, అది ప్రేక్షకులకు తెలిసేలా ఉండటంతో సినిమా మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు క్రిష్ కూడా పవన్ లేని కారణంగా అతిగా డూప్ ను పెట్టి మేనేజ్ చేస్తున్నాడని కానీ అది సినిమా మీద ప్రభావం చూపుతుందనే టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -