Rajamouli: రాజమౌళి హీరోయిన్ల ఎంపిక వెనుక అసలు కథ ఇదేనా?

Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా కూడా రాజమౌళికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. సినీ ఇండస్ట్రీలో చెరగని రికార్డులతో జక్కన్న దూసుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ చేసిన ఘనత రాజమౌళికే దక్కింది. రాజమౌళి పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలు హ్యాట్సాఫ్ చెబుతూ బాహుబలి పేరును గుర్తు చేసుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

రాజమౌళి ఏ విషయంలోనైనా సరే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తాను అనుకున్నది చేసే వరకూ నిద్రపోడు. అయితే రాజమౌళి తన సినిమాల్లో హీరోల పాత్రలకు ధీటుగా హీరోయిన్ పాత్రను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అంతేకాకుండా హీరోల విషయంలో కూడా ఎన్నో చూసే రాజమౌళి హీరోయిన్స్ విషయంలో మాత్రం మెయిన్ గా ఒకే పాయింట్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడని టాక్ వినిపిస్తోంది.

 

హీరోయిన్ కాల్ షీట్స్ గురించి జక్కన్న ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. కాల్ షీట్స్ ను చూసే తన సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటూ ఉంటాడట. రాజమౌళి ఏ హీరోయిన్ తో సినిమా చేయాలన్నా కూడా ఆ హీరోయిన్ ని ముందుగా కాల్ షీట్స్ చూసే బుక్ చేసుకుంటాడని తెలుస్తోంది.

 

బిజీగా ఉన్న హీరోయిన్ ఎక్కువ సినిమాలకి కమిట్ అయిన హీరోయిన్ ని రాజమౌళి తన సినిమాలో పెట్టుకోవడానికి అంతగా ఇష్టపడరని తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి ఏ సినిమా తీసిన మూడు నాలుగు ఏళ్ళు పైగానే తీసుకుంటూ ఉంటాడు కాబట్టి హీరోయిన్స్ చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉండి రాజమౌళిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన అలా ఎంపిక చేసుకుంటాడట. ఈ పక్కా ప్లానింగ్ కారణంగానే రాజమౌళి సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అవుతూ వెళ్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -