YS Sunitha: వైఎస్ సునీత కోరుతున్న న్యాయం వెనుక అసలు కథ ఇదేనా?

YS Sunitha: వైయస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఇప్పుడిప్పుడే ఊరట లభిస్తుంది అనుకుంటున్నా సమయంలో తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత కోర్ట్ ని ఆశ్రయించడంతో ఈ కేసు మళ్ళీ కొలిక్కి వచ్చినట్టు అయింది. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో వారికి శిక్ష పడాల్సిందేనని వైఎస్ సునీత పోరాడుతున్నారు. అపోలోలో సీనియర్ డాక్టర్ గా ఆమె విధులు నిర్వహిస్తూనే తన తండ్రిని చంపిన హంతకులకు శిక్షపడేలా ప్రయత్నాలు చేస్తోంది సునీత. ఆమెపై తాజా రాజకీయ కుట్రను వైసీపీ వర్గాలు ప్రారంభించాయి.

ఆమె టీడీపీ తరపున పోటీ చేస్తారని నీలి, కూలి మీడియాల్లో ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వైఎస్ వివేకా కుమార్తె సునీత కలిశారని ఎందుకు కలిశారో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఆయన సునీత వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తుందని కూడా అన్నారు. అసలు సునీత చంద్రబాబును ఎప్పుడు, ఎక్కడ కలిశారో ఆయన చెప్పాల్సింది. కానీ చెప్పలేదు. ప్రజల్లో ఒక తప్పుడు భావన వ్యాప్తి చేయడానికి సునీత పోరాటంలో రాజకీయం ఉందని చెప్పడానికి సజ్జల అలాంటి ప్రకటన చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వైఎస్ సునీత ఇప్పటి వరకూ రాజకీయ పరంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

అలాఅని రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు కూడా చెప్పలేదు. ఏ టీడీపీ నేతనూ కలవలేదు. నిజానికి సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనుమానించిన వ్యక్తుల జాబితాలో ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఆమెకు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు వైసీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కడప లోక్‌సభ పరిలో టీడీపీ తరపున వైఎస్‌ వివేకా కుమార్తె వైఎస్ సునీత బరిలోకి దిగబోతున్నారని వైసీపీ ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. కానీ సునీత మాత్రం రాజకీయంగా తన ఆసక్తిని ఒక్కసారి కూడా వ్యక్తం చేయలేదు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -