Funeral: అంతక్రియల సమయంలో కుండకు కన్నాలు పెట్టడం వెనుక ఆంతర్యం ఇదే?

Funeral: సాధారణంగా ఈ భూమి పై ఉన్న ప్రతి ఒక్క ప్రాణి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. అది మనుషులైనా మూగజీవాలైన ఎవరైనా చివరికి మట్టిలో కలిసి పోవాల్సిందే. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక విషయం చెప్పాడు. పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి జన్మించక తప్పదు.. తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే ఈ సృష్టిలో తన ప్రమేయం లేకుండా జరిగే రెండు చర్యలివి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తనకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి.

చనిపోయిన తర్వాత కూడా వారివారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా చనిపోతే హిందూ సంప్రదాయం ప్రకారం కాలుస్తారు లేదంటే పూడ్చిపెడతారు. అయితే అంత్యక్రియల సమయంలో మృతదేహాన్ని కాల్చేటప్పుడు ఆ మృతదేహం చుట్టూ కుండపట్టుకుని తిరుగుతారు. ఈ క్రమంలోనే ఆ కుండకు దానికి రంధ్రాలు కూడా పెడతారు. ఆ తరువాత ఆఖర్లో కుండ పగలగడతారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు అంటే చాలామందికి సమాధానం తెలియదు. ఆ విషయంలోకి వెళితే.. కుండ.. అలాగే కుండలోని నీరులా శరీరం, ఆత్మ రెండూ వేరు వేరు.

 

కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ వందేళ్లు బతికి ఉంటే పూర్ణాయుష్షు అని ఫిక్సైపోయారు. కానీ మారుతున్న అలవాట్లు, వాతావరణం ప్రభావంతో 70 దాటితే గొప్ప అన్నట్టుంది పరిస్థితి. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ అందులో ఉండలేదు. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది. ఆ శరీరానికి అంత్యక్రిలు నిర్వహించేవరకు ఆత్మ మళ్లీ తన శరీరాన్ని మేల్కొలపాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకే పాడెకట్టి శరీరాన్ని తీసుకెళ్లినప్పుడు శ్మశానానికి కొద్దిదూరంలో దింపి బియ్యం కానీ, ఆవాలు కానీ కట్టిన మూటను విప్పి కింద పోస్తారు. ఆ తర్వాత శరీరాన్ని తీసుకెళ్లి దహనం చేస్తారు. కాలి బూడిదైన తర్వాత కూడా ఆ ఆత్మ వెళ్లిపోకుండా వెనక్కు తిరిగి రావాలని చూస్తే శరీరం పై చల్లిన పేలాలు, బియ్యం పూర్తిగా లెక్కించాలని అదికూడా చీకటి పడేలోగా మాత్రమే అని చెబుతారు. కుండ ఎందుకు పగలగొడతారు అన్న విషయానికి వస్తే.. శరీరాన్ని చితిపై పెట్టి కుండలో నీరు పోసి రంధ్రాలు చేస్తూ చుట్టూతిరుగుతారు. కుండ శరీరం.. అందులో నీరు ఆత్మలాంటివి. కుండకు కన్నం పెట్టగానే నీరు బయటకు వచ్చేసినట్టు ప్రాణం పోయిన వెంటనే ఆత్మ శరీరాన్ని వీడిపోవాలనే సంకేతం అది. కన్నం పడిన కుండ పనికిరానట్టే ఈ శరీరం కూడా ఇకపనికిరాదు దీన్ని విడిచిపో అని ఆత్మకు చెప్పడమే దీని వెనుక ఉన్న ఆంతర్యం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -