Taraka Ratna: తారకరత్న పెదకర్మ ఖర్చు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Taraka Ratna: నందమూరి తారకరత్న అకాల మరణాన్ని అభిమానులు, కుటుంబసభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చివరివరకు తోడుండాల్సిన భర్త ఒంటరిని చేస్తూ వెళ్లిపోవడంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లోకేష్ పాదయాత్ర సమయంలో జనవరి 27న గుండెపోటుకు గురైన తారకరత్న బెంగుళూరు నారాయణ హృదలయ ఆసుపత్రిలో 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. అంతిమసంస్కారాలను బాలకృష్ణ, ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల తారకరత్న చిన్న కర్మ కూడా నిర్వహించారు.

 

మొదటి నుంచి తారకరత్న కుటుంబానికి బాలకృష్ణ అండగా ఉంటున్నారు. అలాగే పిల్లల బాధ్యతనూ తానే తీసుకుంటానని వెల్లడించారు. తాజాగా తారకరత్న పెద్ద కర్మ తేదీని కూడా ప్రకటించారు ఆయన కుటుంబసబ్యులు. తారకరత్న పెద్దకర్మకు సంబంధించిన కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారకరత్న కుటుంబసబ్యులు కార్డును ప్రింట్ చేయించారు.మార్చి 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్డుపై నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లను ప్రచురించారు

 

 

ఇప్పుడు ఈ పెద్ద కర్మకు అయ్యే ఖర్చును అంతా బాలయ్య, విజయసాయి రెడ్డి భరించేందుకు సిద్ధమయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు తెలిసింది. ఈ డబ్బును నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి భరిస్తారని తెలిసింది. మెుదటి నుంచి వీరిద్దరే తారకరత్న అన్నీ కార్యక్రమాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -