Srikanth: విడాకుల విషయంలో శ్రీకాంత్ చేసిన పని ఇదేనా?

Srikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ కథ చిత్రాలలో నటించిన శ్రీకాంత్ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.

 

ఇకపోతే మార్చి 23వ తేదీ శ్రీకాంత్ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.శ్రీకాంత్ నటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇప్పటికే పెద్ద కుమారుడు రోషన్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడానికి కృషి చేస్తున్నారు. ఇలా తన వైవాహిక జీవితంలో శ్రీకాంత్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇలా సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. అయితే ఈ వార్తలపై గతంలో స్పందించిన శ్రీకాంత్ తాజాగా మరోసారి స్పందిస్తూ పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రాసే వాళ్ళు కాస్త చూసుకోవాలని తెలిపారు. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు మనం బాధపడటమే కాకుండా మన ఫ్యామిలీ కూడా బాధ పడుతుందని ఆ సమయంలో కొన్ని అనర్థాలు కూడా జరగవచ్చని తెలిపారు.

 

గతంలో ఒకసారి నేను చనిపోయాను అంటూ వార్తలు రాశారు. ఈ వార్తలు తనని చాలా బాధపెట్టాయని తెలిపారు. ఇలాంటి వార్తలు రాసే వారిలో ముందు మార్పు రావాలని తెలిపారు.ఇక నేను ఊహ విడాకులు తీసుకోబోతున్నామని వార్తలు వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. సాధారణంగా ఊహకు ఎక్కడకైనా ఫంక్షన్లకు రావాలి అంటే అసలు ఇష్టం ఉండదు.ఇలాంటి వార్తలు వచ్చిన తర్వాత తను రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ విడాకుల పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -