Viagra: వామ్మో వయాగ్రా ఎక్కువైతే అంత డేంజరా?

Viagra: ఇటీవల కాలంలో చాలా మంది వయాగ్రాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి ముఖ్యంగా తొలి కలయికలో పాల్గొంటున్న వారు అలాగే భాగస్వామితో ఎక్కువ సేపు శృంగారం చేయాలనుకుంటున్నా వారు వయాగ్రా టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా యువత వినియోగిస్తోంది. శృంగారంలో రెచ్చిపోవడం కోసం చాలామంది ఈ వయాగ్రాను ఉపయోగిస్తున్నారు. మరి ముఖ్యంగా అంగస్తంభన సమస్య ఉన్నవారు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

కొన్ని కొన్ని వయగ్రా ప్రభావం కాసేపు ఉండటం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. అయితే వయాగ్రా టాబ్లెట్లను అందరూ ఉపయోగించకూడదని కేవలం అంగస్తంభన సమస్యలు ఉన్నవారు మాత్రమే ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు. అలాగే శృంగారంలో పాల్గొనేంత ఫిట్ గా లేని వాళ్లు కూడా వాటిని ఉపయోగించకూడదని చెబుతున్నారు. వాటి దాని కారణంగా వాళ్లు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వయాగ్రా టాబ్లెట్స్ పురుషాంగం లోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది.

దీనిని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. సెక్స్ లో పాల్గొనాలి అనుకున్న సమయానికి కంటే గంట ముందుగా వేసుకోవాలి. అప్పుడే దాని పనితీరు బాగుంటుంది. వీటిని ఆహారంలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. కానీ గ్రేప్ జ్యూస్ లో మాత్రం కలిపి తీసుకోకూడదట. అలా తీసుకుంటే దాని పనితీరు తగ్గిపోతుంది. కొన్ని కొన్ని సార్లు వాటి ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది పలు రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇక రోజుకు ఎన్ని వయాగ్రా టాబ్లెట్లు ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. రోజుల్లో ఒక్క టాబ్లెట్ మాత్రమే తీసుకోవాలని, అది కూడా 50 ఎంజికి మించరాదని సూచిస్తున్నారు వైద్యులు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -