Vijay Thalapathy: విజయ్ వారసుడు మూవీ ఆ సినిమాకు కాపీనా?

Vijay Thalapathy: తెలుగు దర్శకుడు, నిర్మాత, తమిళ హీరో కాంబోలో మొదటిసారి వస్తున్న సినిమా ‘వారసుడు’. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఇలయపతి విజయ్ హీరోగా చేస్తున్న సినిమా ‘వారసుడు’ ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలనే విజయ్ కల.. ‘వారసుడు’ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ రష్మిక మందన నటించింది.

 

తెలుగులో ‘వారసుడు’గా తమిళంలో ‘వరీసు’గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు మాత్రం ఇది ఫ్రెంచ్ సినిమా కాపీ అని అంటున్నారు. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది హెయిర్ అప్పారెంట్: లార్గొవించ్’ కాపీనే వారసుడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా జెరోమ్ సల్లే దర్శకత్వంలో వచ్చిన ‘ది హెయిర్ అప్పారెంట్: లార్గొవించ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

 

కానీ చాలామంది దర్శకులు మాత్రం ఈ సినిమా నుండి కొత్త కథలను క్రియేట్ చేసి, వాటిని సినిమాలుగా తీశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ తో కలిసి చేసిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ‘ది హెయిర్ అప్పారెంట్: లార్గొవించ్’ స్పూర్తి. కాగా భారీ అంచనాలతో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా బోల్తా కొట్టడం తెలిసిందే. ఇక ఇదే కోవలోకి ప్రభాస్ ‘సాహో’ కూడా వస్తుంది. ఇందులో కూడా ఫ్రెంచ్ సినిమా ‘ది హెయిర్ అప్పారెంట్: లార్గొవించ్’ ఛాయలు కనిపిస్తుంటాయి.

 

నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసిన వంశీ పైడిపల్లి ఫ్రెంచ్ కథనే కొత్తగా వడ్డిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో వంశీ పైడిపల్లి అక్కినేని నాగార్జున, కార్తితో కలిసి ‘ఊపిరి’ సినిమా చేయగా.. అది ఫ్రెంచ్ సినిమా అయిన ‘ది ఇన్ టచబుల్స్’ స్పూర్తితో తెరకెక్కించాడు. మరి ఇప్పుడు ఈ ‘వారసుడు’ సినిమాను అయినా ఒరిజినల్ కథతో తెరకెక్కించాడా? లేదంటే నెటిజన్లు అంటున్నట్లు ఫ్రెంచ్ సినిమాకు కాపీనా అనేది సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -