Ishan Kishan: ఇషాన్ కిషన్ విధ్వంసం.. మూడో వన్డేలో డబుల్ సెంచరీ.. భారత్ తరఫున ఒకే ఒక్కడు..!

Ishan Kishan: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆలస్యంగా మేల్కొంది. వరుసగా రెండు వన్డేలలో ఓడిన తర్వాత మూడో వన్డేలో మాత్రం జూలు విదిలిచ్చింది. రెండో వన్డేలో గాయపడ్డ రోహిత్ శర్మ గైర్హాజరీలో తుదిజట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. విధ్వంసం సృష్టించాడు. తనకు అవకాశాలివ్వడం లేదనే కసో లేక మరే కారణమో గానీ బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఇషాన్.. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

85 బంతులలోనే సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. తర్వాత రెండో సెంచరీ చేయడానికి 31 బంతులే తీసుకున్నాడు. సెంచరీ చేసే క్రమంలో 10 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. తర్వాత మరో 14 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేశాడు. తద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఆ రికార్డులివే..

– అతి తక్కువ బంతుల్లో (126) డబుల్ సెంచరీ చేసిన ఘనత
– రోహిత్ శర్మ (3 డబుల్ సెంచరీలు), సచిన్ టెండూల్కర్ (1), వీరేంద్ర సెహ్వాగ్ (1) తర్వాత ఈ ఘనత అందుకున్న నాలుగో క్రికెటర్.
– భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. (గతంలో డబుల్ సెంచరీలు చేసిన రోహిత్, సచిన్, సెహ్వాగ్ లు రైట్ హ్యాండ్ బ్యాటర్లే)
– అంతర్జాతీయ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన వారిలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత రికార్డు ఇషాన్ కిషన్‌దే కావడం గమనార్హం.
– అంతేగాక వన్డేలలో అతి తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన రికార్డును కూడా ఇషాన్ బద్దలు కొట్టాడు. గతంలో క్రిస్ గేల్.. 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. తాజాగా ఇషాన్ 126 బంతుల్లోనే ఆ ఘనత అందుకోవడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -