Prithvi Shaw: రంజీల్లో పృథ్వీ షా అజేయ డబుల్ సెంచరీ.. టీమిండియాలోకి వచ్చేస్తాడా?

Prithvi Shaw: కొంతకాలంగా టీమిండియాలో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో అతడు రంజీల్లో అదరగొట్టాడు. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరును పృథ్వీ షా సాధించాడు. భారత సెలక్టర్లు తనను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడంలేదనే కోపంతో రగిలిపోతున్న షా.. బంతిపై తన ప్రతాపాన్ని చూపించాడు. 283 బంతుల్లో 33 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 240 పరుగులతో అజేయంగా నిలిచాడు.

 

అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా ముంబై టీమ్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా డబుల్ సెంచరీ సాధించడంతో ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, ముషీర్ ఖాన్ తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆట ముగిసే సమయానికి క్రీజులో పృథ్వీ షాతో పాటు కెప్టెన్ అజింక్యా రహానే(140 బంతుల్లో 5 ఫోర్లతో 73 బ్యాటింగ్) ఉన్నారు.

 

ఈ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ రహానె కూడా టీమిండియాలో చోటు కోసం కష్టపడుతున్నాడు. అతడు ఈ మ్యాచ్‌లో ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తాడో చూడాలి. మరోవైపు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో తాను జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పృథ్వీ షా భారత సెలక్టర్లకు సందేశం పంపాడు.

 

ఇప్పుడైనా ఎంపిక చేస్తారా?
విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో యువ ఆటగాడు పృథ్వీ షా రాణిస్తున్నా.. అతనికి భారత జట్టులో చోటు దక్కడం లేదు. అయితే ధాటిగా ఆడగలిగే పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవాలని, అతడిని జట్టుకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌‌ లాంటి మాజీ ఆటగాళ్లు టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -