YS Jagan: పవన్ ను ఓడించండి ప్లీజ్.. జనసేన మాజీ నేతలకే జగన్ టార్గెట్ ఇచ్చారా?

YS Jagan: ఎన్నికల సమయంలో నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి రావడం సర్వసాధారణంగా జరిగే అంశం. ఇలా రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతోమంది రాజకీయ నాయకులు ఒక పార్టీని విడిచి మరొక పార్టీలోకి వస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఆశించిన మొత్తంలో ఆ పార్టీలో మేలు జరగలేదు అంటే మరో పార్టీలోకి వస్తారు కానీ మరి కొందరు పార్టీ పట్ల పార్టీ అధినేత పట్ల వినయ విధేయతలను ప్రదర్శిస్తూ అదే పార్టీలో కొనసాగుతూ ఉంటారు కానీ పార్టీలోకి చేరిన రెండు వారాలకే పార్టీ మారడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

జనసేన పార్టీలోకి చేరి ఆ పార్టీ నుంచి రెండు వారాలకి బయటకు వచ్చినటువంటి జనసేన నాయకుడు గంట నరహరి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు ఇలా వైసిపి పార్టీలోకి వచ్చినటువంటి నరహరి పవన్ కళ్యాణ్ ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదని ఈ విషయం నేను చాలా త్వరగా అర్థం చేసుకోవడంతోనే బయటకు వచ్చానని తెలిపారు.

నేను అదే పార్టీలో కనుక కొనసాగితే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఇక పార్టీలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. ఇలా జనసేన పార్టీని వదిలి వైయస్సార్సీపీ పార్టీలోకి వచ్చినటువంటి నరహరికి ఏ విధమైనటువంటి టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన ఈ పార్టీలోకి వచ్చే సమయానికి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించేశారు.

ఇలా ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కాపు నాయకుడు అయినటువంటి ఈయనకి జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఈయన పిఠాపురంలో ఇన్చార్జిగా పని చేస్తూ అక్కడ పవన్ కళ్యాణ్ ని ఓడించే దిశగా వంగా గీతను గెలిపించే దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా జగన్ నరహరికి బాధ్యతలు అప్పగిచ్చినట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -