Jagapathi Babu: సౌందర్యతో నాకు ఎఫైర్ ఉందంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిన జగపతిబాబు!

Jagapathi Babu: టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి అందాల తర సౌందర్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక చక్కని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక సౌందర్య తన అందంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. తన చక్కని చీర కట్టుతో తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది.

అప్పట్లో చాలామంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ అమ్మడు. ఇక సౌందర్య సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అప్పట్లో బీజేపీ తరుపున ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయంగా కూడా ఈ అమ్మడు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య సినీ ఇండస్ట్రీకి తీరని లోటుని ఇచ్చి వెళ్లింది. అనుకోకుండా తను ప్రయాణించే విమానం కుప్ప కూలిపోవడంతో సౌందర్య మరణించింది.

మరి ఇదంతా పక్కన పెడితే అప్పటి ఫ్యామిలీ హీరో జగపతిబాబు గురించి మనందరికీ తెలిసిదందే. అప్పట్లో జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ కూడా స్క్రీన్ పై మరో స్థాయిలో పండేది. కాగా అప్పట్లో జగపతిబాబుకు సౌందర్య తో ఎఫైర్ ఉందని వార్తలు జోరుగా సాగాయి. కానీ ఈ విషయం గురించి సౌందర్య అప్పుడు ఏమి స్పందించలేదు. ఇటు జగపతిబాబు కూడా ఈ విషయం గురించి రియాక్ట్ అవలేదు.

ఇక తాజాగా జగపతిబాబు ఈ విషయం గురించి స్పందించాడు. సౌందర్యతో నాకు నిజంగానే ఎఫైర్ ఉందని తెలిపాడు. అయితే ఆ ఎఫైర్ మీరు అనుకుంటున్నట్లు కాదు.. తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని తెలిపాడు. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తనతో పంచుకునే వాడిని అని తెలిపారు. అంతేకాకుండా సౌందర్య వాళ్ళ అన్నయ్య నాకు చాలా మంచి స్నేహితుడని తెలిపారు. ఇక సౌందర్య ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా మంచి స్నేహం ఉందని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -