Jagapathi: అమ్మను చూడాలంటే అడవి దాటాల్సిందే.. జగపతికి ఇంత కష్టమా?

Jagapathi: తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, హీరో జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అప్పట్లో జగపతి బాబు ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలలో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలో నటిస్తూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే మధ్యలో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న జగపతిబాబు ఆ తర్వాత లెజెండ్ సినిమాతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఏ విషయాలు అయినా కూడా కుండబద్దలు కొట్టినట్టుగా ముఖం మీదే చెప్పేస్తున్నారు జగపతిబాబు. ఇది ఇలా ఉంటే ఇటీవల తన కూతుర్ల విషయంలో తన నిర్ణయాన్ని చెప్పి వార్తలలో నిలిచారు. తాజాగా తన తల్లి నివాసాన్ని ప్రేక్షకులకు చూపించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా జగపతి బాబు తన తల్లి నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ లోని తన తల్లి ఉంటున్న ఇల్లు చూపిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. నవమి సందర్భంగా పానకం తాగడానికి తన తల్లి ఇంటికి వచ్చానని తెలిపారు.

 

అందరకీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పానకం తాగాలనిపిచ్చింది. అందుకే మా అమ్మ ఇంటికి వచ్చాను. ఈ ప్లేస్ అంతా ఒక అడవిలా ఉంటుంది. కానీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. అమ్మ పానకం ఇస్తాను రా అంటే వచ్చాను. పానకం ఒక్కటే సరిపోదు.. నూకలతోప కావాలని అన్నాను ఈ పేరు మీరు విన్నారో లేదో తెలీదు. దాన్ని తిని ఓ పాతిక సంవత్సరాలు అయినట్లుంది. చాలా కాలం తర్వాత అమ్మ చేతితో భోజనం చేయబోతున్నాను. అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. తను చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా అమ్మ ఉండే స్థలం.

 

ఒక యోగి.. యోగిని అంటారే ఆ టైపులో తను సెటిల్ అయిపోయింది అని చెప్పుకొచ్చారు జగపతి బాబు. అయితే తన తల్లిని మాత్రం చూపించలేదు. నిజంగానే జగపతి బాబు తల్లి ఉండే గది అడవి మధ్యలో ఉన్నట్లుంది. చుట్టూ చెట్లు మధ్యలో చిన్న దారి.. అక్కడే ఋషి విగ్రహం చూస్తుంటే ఓ తపోవనంలా కనిపిస్తోంది. ఆ వీడియోని చూసిన చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొడుకు అంత మంచి స్థాయిలో ఉండి అన్ని డబ్బులు సంపాదిస్తున్నా కూడా తల్లి అవేమీ ఆశించకుండా అలా చిన్న కుటీరంలో ఉండడం చూసి చాలామంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -