Jakkanna: వామ్మో.. జక్కన్న మహేశ్ ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్ చేశాడుగా?

Jakkanna: దర్శకధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంపై ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రపంచస్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని తెలిసి ఫ్యాన్ ఇప్పటి నుంచే ఆనందపడుతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కితే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్ వస్తూ ఉంటోంది. అయితే ఈ యాక్షన్ మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని, మహేశ్ బాబు లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సినిమా త్వరగా స్టార్ట్ చేస్తే బాగుటుందని భావిస్తున్నారు.

 

 

ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్‌తో దర్శకుడు రాజమౌళి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇక అదే ఉత్సాహంతో మహేశ్ బాబుతో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కూడా ప్రారంభించారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఆర్‌ఆర్ఆర్ సక్సెస్‌తో ఇండియన్ ఫ్యాన్స్ కూడా రాజమౌళి సినిమా కోసం ఉత్సాహం చూపుతున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమాకు మహేశ్ బాబు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రాజమౌళితో కలిసి సినిమా చేయబోతున్నారని టాక్.

 

 

అయితే తాజా సమాచారం ప్రకారం.. 2024లో ఈ సినిమా షూటింగ్ పనులు స్టార్ట్ అవుతాయని తెలిసింది. ప్రపంచ స్థాయిలో నిర్మించబోతున్న ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్లను పని చేయబోతున్నారు. బిజినెస్ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టూడియోలతో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ డేట్స్ సెట్ చేసుకునే పనిలో ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్నారట. అన్నీ సెట్ చేసుకున్న తర్వాతే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -