Rohit : జానకి వెడ్స్ శ్రీరామ్ హీరో ఇప్పుడు ఎలా మారాడో చూసారా?

Rohit : టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు రోహిత్ తో అంతగా ర్యాపో లేకపోవచ్చు. కానీ దేవుడు వరమందిస్తే అనే పాటలో హీరో అని చెబితే ఎవరైనా టక్కున గుర్తుపడతారు. ఎందుకంటే ఈ పాట అప్పటి ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకుంది కాబట్టి. ఇప్పటి ప్రేమికులు కూడా ఈ పాటను బాగా ఆలపెట్టారు. ఇప్పుడు ఆ పాటలో హీరోగా నటించిన రోహిత్ అందరికీ తెలిసిన వాడే. ఆ పాటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

అనంతరం రోహిత్ జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో నటించి లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతోనే కొంతమంది అభిమానం కూడా సంపాదించుకున్నాడు రోహిత్. ఇక ఇవే కాకుండా శంకర్ దాదా ఎంబిబిఎస్, సీతామహాలక్ష్మి వంటి సినిమాల్లో నటించాడు. కానీ రోహిత్ కు ఈ సినిమాలో అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన వసంతం సినిమాలో రోహిత్ తన స్నేహితుడు పాత్రలో నటించాడు.

ఆ తర్వాత నుంచి రోహితో మరో సినిమాలో కనిపించలేదు. ఇక 2013లో హాట్ బాయ్ అనే సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత అలా కొన్ని చిత్రాల్లో అడపా దడపా నటించినప్పటికీ ఆ సినిమాలో రోహిత్ కు అంతా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. కానీ అలాంటి రోహిత్ ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. తాజాగా రోహిత్ హీరోగా నటిస్తున్న కళాకార్ అనే సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశాడు. ఇందులో రోహిత్ గుర్తుపట్టలేని విధంగా చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. అది చూసిన వారంతా అతడు నిజంగా రోహిత్ ఏనా అని అనుమానం పడుతున్నారు. నిజంగా రోహిత్ ఆ ఫోటోలో చాలా భిన్నంగా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు అసలా హీరోకి ఏమైంది? ఇలా మారిపోయాడు అని కామెంట్ల రూపంలో అడుగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Family: హరికృష్ణ చనిపోతే ముసలి కన్నీరు.. బాబు అరెస్ట్ అయితే పార్టీలు.. ఆ స్టార్ హీరో నిజస్వరూపమిదేనా?

Nandamuri Family: నిజ జీవితంలో మామూలుగా గొడవలు కొట్లాటలు ఉండడం అన్నది సహజం. అయితే ఎన్ని గొడవలు ఎంత మాట్లాడకపోకపోయినా కూడా చనిపోయినప్పుడు చివరిసారిగా కడసారిగా చూడడానికి అవన్నీ పక్కన పెట్టి వెళ్తూ...
- Advertisement -
- Advertisement -