Pratinidhi 2: ప్రతినిధి2 మూవీ అలా ఉండబోతుందా.. అసలేం జరిగిందంటే?

Pratinidhi 2: హీరో నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ గా ఇస్తున్నాడు. తన కమ్ బ్యాక్ సినిమానే పొలిటికల్ మూవీని ఎంచుకున్నాడు.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ సినిమాకు ప్రతినిధి 2 అనే ఒక టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా అందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీయబోతున్నారు అన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

నారా రోహిత్ టీడీపీ కి చెందిన వ్యక్తి, అలాగే సినిమా దర్శకుడు కూడా టీడీపీ మనిషే. టీవీ5 మూర్తి ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు. అయితే సరిగ్గా ఇక్కడే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మహి వి రాఘవ్, యాత్ర-2 తీస్తున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను తీస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వైసీపీకి మద్దతుగా ఉండబోతున్నాయి. వీటికి పోటీగా టీడీపీకి మద్దతుగా ప్రతినిధి-2 సినిమా వస్తుందనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే యూనిట్ మాత్రం ప్రస్తుతానికి ఈ వాదనను ఖండిస్తోంది. కాస్త పొలిటికల్ టచ్ ఉన్నప్పటికీ, సామాజిక అంశాల్ని మాత్రమే టచ్ చేశామని, ఏ పార్టీకి మద్దతుగానో, వ్యతిరేకంగానో ఈ సినిమాను తీయలేదని అంటున్నారు.

 

కాగా ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలోకి రానుంది. మరి నిజంగానే చిత్ర బృందం చెబుతున్నట్టుగా సామాజిక అంశాలను మాత్రమే టచ్ చేస్తారా లేదంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీసారా అన్నది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే మరి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్స్ స్పందిస్తూ ఈ సినిమా జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే విధంగా ఉండబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -