Janasena: ఏపీలో జనసేన చరిత్ర ముగిసినట్లేనా.. ఆ పార్టీని ఎవరూ ఇకపై పట్టించుకోరా?

Janasena: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా భారీ కుంభకోణం చేశారని ఆరోపణలతో ఈయనని జైలుకు పంపించారు ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మూడు ప్రాంతీయ పార్టీలు ఉండేవని అందరూ భావించారు చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీలో ఉన్నది రెండే పార్టీలని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా స్థాపించి తన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు స్కాం చేసే అరెస్ట్ అయ్యారు. అలాగే జగన్ కూడా పలు కేసులలో జైలుకు వెళ్లి వచ్చిన వారే. ఇలా ఈ రెండు పార్టీ అధినేతలు పలు కేసులలో జైలుకు వెళ్లారు కనుక ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు.

ఏ విధమైనటువంటి కుంభకోణం లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా పవన్ కళ్యాణ్ తనని తాను ప్రచారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో తన పార్టీని బలం చేకూర్చుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయడం లేదు తాను తెలుగుదేశం పార్టీకి బానిసనే అని మరోసారి రుజువు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో తన మద్దతు తెలపడమే కాకుండా లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ హడావిడి ఎక్కువగా ఉందని చెప్పాలి.

జనసేన అభ్యర్థులు కూడా లోకేష్ వెంట కలిసి తిరగడంతో ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలు ఒకటేననే భావనలోకి వచ్చారు. ఇలా ఈ రెండు పార్టీలు ఒకటే అన్న అవగాహనకు ప్రజలు రావడంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రెండే పార్టీల మిగులుతాయని జనసేన పార్టీ చరిత్ర ఇంతటితో ముగిసినట్లేనని స్పష్టంగా అర్థం అవుతుంది. జనసేన అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. ఎవరు కూడా జనసేన పార్టీని పట్టించుకోనే పరిస్థితులలో లేరని చెప్పాలి

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -