Pawan Kalyan: జనసేనకు మరో టికెట్ కట్.. పవన్ కళ్యాణ్ పార్టీకి సీట్లు తగ్గడం వెనుక అసలు కారణాలివే!

Pawan Kalyan: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు తెలివైన వాడని అత్తారింటికి దారేది సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సినిమాలో పవన్ కల్యాణ్ కోసం రాసిన ఈ డైలాగ్.. నిజ జీవితంలో కూడా పవన్ కోసం బాగా పనికొస్తుంది. అయితే.. ఎక్కడి తగ్గాలో తెలిసినవాడు తెలివైన వాడు మాత్రమే కాదు.. గొప్ప నాయకుడు అని కూడా అనిపించుకుంటున్నాడు పవన్. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకోసం చాలా ప్రయత్నాలు చేశారు. పొత్తు కుదిరితే అన్ని పార్టీలకూ లాభం జరుగుతుంది. కానీ, పొత్తుకు బీజం పడింది పవన్ కల్యణ్ దగ్గరే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చెప్పారు. ఓ రాజకీయ నాయకుడిగా తన పార్టీని బలపరచడం కోసమే ఈ వ్యూహం రచించి ఉండొచ్చు. కానీ, ప్రభుత్వం వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా ఉండటం కోసం ఒకటి కాదు రెండు కాదు వంద అడుగులు వెనక్కి తగ్గుతున్నారు.

సీట్ల కేటాయింపులో మొదట పవన్ కల్యాణ్ జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. నిజానికి జనసేకు ఉన్న ఓట్ బ్యాంక్‌కు 24 స్థానాలు తక్కువే. కానీ, బలమైన అభ్యర్థులు లేరని అర్థం చేసుకున్న పవన్ 24 స్థానాలకు అంగీకరించారు. కానీ, ఆ 24 స్థానాల్లో కూడా మరో 3 సీట్లను పవన్ వదులుకున్నారు. దీంతో, జనసేన కార్యకర్తలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవని ఆయన తన పార్టీ శ్రేణులకు నచ్చజెప్పారు. ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పులేదని వివరించారు. సింగిల్ గా పోటీ చేస్తే ఈ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వస్తుందని తెలిపారు. ఒకటి రెండు స్థానాలు దగ్గర పట్టుబడితే కూటమిలో బీటలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అది చివరికి వైసీపీకి లాభం చేస్తుందని కార్యకర్తలకు సూచించారు. వైసీపీని గద్దే దించడమే లక్ష్యంగా ముందుకు పోవాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు కాస్త శాంతించారు.

పొత్తులో భాగంగా బీజేపీకి 10 స్థానాలు కేటాయించారు. అయితే, ఇప్పుడు మరో స్థానాన్ని కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ దగ్గర బీజేపీ నేతలు ఈ విషయంపై ప్రస్తావించగా.. ఇప్పటికే టీడీపీలో అశావహులు ఎక్కువ అయ్యారని.. ఇప్పుడు మరోస్థానాన్ని వదులుకుంటే క్యాడర్ గందరగోళానికి గురవుతారని చెప్పారట. దీంతో.. బీజేపీ అధిష్టానం పవన్ ను సంప్రదించిందట. పవన్ కూడా మొదట ససేమేరా అన్నట్టు తెలుస్తోంది. కానీ, తప్పని సరి పరిస్థితుల్లో మరో స్థానాన్ని వదులుకోవడానికి సిద్దం అవుతారని ప్రచారం జరుగుతుంది. పొత్తు కోసం ఏడాదిగా పవన్ కష్టపడ్డారు. ఇప్పుడు ఆ ఒక్క సీటు విషయంలో కూటమి నాయకుల్లో ఎందుకు గ్యాప్ పెరగాలి అని పవన్ ఆలోచిస్తున్నారట. అందుకే, జనసేనకు 21 స్థానాలు కేటాయించినా.. 18 స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించారు. మరో మూడు స్థానాల్లో ఏదో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని జనసేనలో చర్చ నడుస్తోంది. ఎన్ని అడుగులు వెనక్కి వేసినా.. అధికార కూటమిలో భాగంగా అసెంబ్లీకి జనసేనను నడిపించాలనే అంతిమ లక్ష్యంతో పవన్ ముందుకు వెళ్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -