Director Atlee: టాలీవుడ్ ఇండస్ట్రీకి జక్కన్న.. కోలీవుడ్ ఇండస్ట్రీలో అట్లీ.. డైరెక్టర్ అట్లీ సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

Director Atlee: జవాన్ సినిమాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీ కి జక్కన్న, కోలీవుడ్ కి అట్లీ అంటూ కంపేర్ చేస్తూ అతని గురించి మరిన్ని వివరాల కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. 2011 ముందు వరకు రోబో, నన్ బన్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటికీ 2011లో ముగపుతగమ్ అనే షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించి అందరి ప్రశంసలు అందుకున్నాడు అట్లీ.

ఆ తర్వాత రాజా రాణి సినిమాతో వెండితెరపై దర్శకుడుగా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది. ఆ తరువాత విజయ్ తో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించారు అన్ని సూపర్ డూపర్ హిట్లే. ఈయన తెరి సినిమాకి, మెరిసేల్ సినిమాకి కూడా ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డులు అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన జోనర్ మార్చి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎంచుకొని విజయ్ తో మరొక విజయం సాధించారు.

ఆ సినిమాయే 2019లో వచ్చిన బిగిల్. నయనతార కథానాయక. ఈ సినిమా కూడా 180 కోట్ల బడ్జెట్ రూపొందిస్తే 280 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఐదవ సినిమాతోనే ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. దీంతో అందరికీ ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. షారుక్ ఖాన్ కూడా సౌత్ ఇండస్ట్రీ దర్శకులతో పనిచేయటం చాలా తక్కువ. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న జవాన్ సినిమా ఈనెల ఏడవ తేదీన విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డు సృష్టించింది జవాన్. నటి కృష్ణప్రియ ను ప్రేమ వివాహం చేసుకున్న అట్లీ తన బాబుతో ఆడుకోవడం కోసం నాలుగు నెలల పాటు విరామం తీసుకోనున్నారు. తరువాత తదుపరి ప్రాజెక్టు పై ఫోకస్ పెడతారు అనిసన్నిహితులు చెప్తున్నారు. నిజంగానే అట్లీ కోలీవుడ్ జక్కన్న. ఒక్క ఫ్లాప్ కూడా అతని రికార్డ్ లో లేకపోవడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -