TDP – YSRCP: టీడీపీ వార‌సుడి విక్ట‌రీ ఖాయమేనట.. వైసీపీ చేసిన తప్పులే టీడీపీకి ప్లస్ అవుతున్నాయా?

TDP – YSRCP: రాజకీయాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు అనే సంగతి మనకు తెలిసిందే. రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగడం రాకపోకలు అనేవి సర్వసాధారణంగా జరుగుతున్న అంశం అయితే త్వరలోనే ఏపీలో ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఎన్నికలపైనే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనులలో నిమగ్నమై ఉన్నారు.

ఇప్పటికే కొంతమంది పేర్లను ప్రకటించడంతో అభ్యర్థులు వారి నియోజకవర్గాలలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో టిడిపి వారసుడి కుమారుడికి విజయం ఖాయమంటూ ఒక వార్త వైరల్ గా మారింది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో కీలకంగా మారినటువంటి జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి గెలుపు ఖాయం అని స్పష్టంగా తెలుస్తోంది.

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా జెసి పవన్ ఎన్నికలలో నిలబడ్డారు అదే విధంగా వైసీపీ తరఫున తలారి రంగయ్య అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు అయితే గతంలో వైఎస్ఆర్సిపికి చాలా మద్దతు లభించింది అంతేకాకుండా తలారి రంగయ్య వంటి ఒక అధికారి ఎన్నికల బరిలో ఉండడంతో ఆయన గెలిచారు కానీ ఈసారి ఎన్నికలలో స్థాన మార్పిడి జరిగింది.

వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా నిలబెట్టారు అయితే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ను పెనుగొండ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం పెనుగొండలో ఉన్నటువంటి మాలగుండ్ల శంకర్ నారాయణకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ఆయనకు ఏకంగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా కేటాయించారు. దీంతో ఈయనకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి తరుణంలో జెసి పవన్ రెడ్డి గెలుపు మరింత సునాయసంగా మారుతుందని వచ్చే ఎన్నికలలో జెసి పవన్ రెడ్డి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -