Jr NTR-Chandrababu Naidu: చంద్రబాబును మావయ్య అంటూ రెండు కోరికలు కోరిన జూనియర్ ఎన్టీఆర్!

Jr NTR-Chandrababu Naidu: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా టాలీవుడ్ లో ఏంట్రి ఇచ్చిన ఎన్టీఆర్.. ఆపై పలు సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నటన విషయంలో పూర్తిగా తాతకు తగ్గ మనవడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

అలా ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగుతున్నాడు. ఇక ఇటీవల దర్శకదీరుడు రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా పలు సినిమా ఆఫర్లు తన సొంతం చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును మామయ్య అంటూ ఒక రెండు కోరికలు కోరాడు. టీడీపీ సభలో మాట్లాడిన ఎన్టీఆర్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి మావయ్యా అని చంద్రబాబుని అడిగాడు. అంతేకాకుండా పార్టీలో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని చంద్రబాబుకు తెలిపాడు. ఎందుకంటే యువత మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి చేదోడు వాదోడుగా అయ్యారు అని ఎన్టీఆర్ తెలిపాడు. ఇక పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన వారిని గుర్తించాలని కోరుకుంటున్నాను అని మహానాడు కార్యక్రమంలో తెలియజేశాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు ఒక రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రాబోయే సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ 31 అనే ప్రాజెక్టులో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ మావయ్య అంటూ చంద్రబాబును కోరిన కోరికలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -