Kadapa Politics: కడప ఎన్నికల్లో వాస్తవ పరిస్థితులు ఇవే.. ఏ నియోజకవర్గం ఏ పార్టీకి అనుకూలమంటే?

Kadapa Politics: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల తర్వాత ఇదే ప్రభుత్వం కొనసాగుతుందా? కొత్త ప్రభుత్వం వస్తుందా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉన్నా.. కడప జిల్లాలో మాత్రం ఫలితాలు ప్రతీసారి ఏకపక్షంగా ఉంటాయి. 2014లో టీడీపీ గెలిచినప్పుడు కూడా ఒక్క రాజంపేట అసెంబ్లీ స్థానం మినహా.. అన్ని వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. 2024 ఎన్నికల్లో వైసీపీకి పరిస్థితి అంత ఈజీగా లేదని స్థానికంగా చర్చ జరుగుగుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ప్రభావం బలంగా ఉంటుందని చెబుతున్నారు. దానికి తోడు… షర్మిల కాంగ్రెస్ లో చేరడం వైసీపీకి పెద్ద మైనస్ అని అంటున్నారు. కడప మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. రాష్ట్రవిభజన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు వైసీపీలో చేరిపోవడం.. ఇప్పుడు వైసీపీ అక్కడ హవా కొనసాగిస్తోంది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ బలపడుతోంది. పైగా వైఎస్ వారసురాలుగా షర్మిల జోరుగా ప్రచారం చేస్తున్నారు. దానికితోడు వివేకాహత్య కేసుతో వైఎస్ కుటుంబం మొత్తం జగన్ కు దూరం అయ్యారు. కొంతమంది కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. మరికొంత మంది సునీతకు న్యాయం జరగాలంటే వైసీపీని ఓడించడం కోసం టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ కడపలో బలపడటంతో టీడీపీకి ఫలితాలు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు.

మొదట పులివెందుల విషయానికి వచ్చినట్టు అయితే.. జగన్ గెలుపు ఖాయం కావొచ్చు కానీ.. నల్లేరు మీద నడకకాదని తెలుస్తోంది. ఇక్కడ వైఎస్ సునీత, సౌభాగ్యమ్మ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వివేకాహత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు. వివేకహత్యకేసు ప్రభావం గట్టిగానే ఉంటుంది. కానీ.. జగన్ ఓ పార్టీ అధినేత, సీఎం కావడంతో చతురంగ బలాలు ప్రయోగిస్తారు. దీంతో.. అత్తెసరు మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది.

ఇక కమలాపురంలో జగన్ మేనమామ ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి పోటీ చేస్తున్నారు.టీడీపీ ఈసారి అభ్య‌ర్థిని మార్చింది. టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా న‌ర‌సింహారెడ్డి త‌న‌యుడు పుత్తా చైత‌న్య‌రెడ్డిని టీడీపీ బ‌రిలో నిలిపింది. వైసీపీ అభ్యర్థి ర‌వీంద్ర‌నాథ‌రెడ్డిపై వైసీపీ నేతలే గుర్రుగా ఉన్నారు. నియోజవర్గానికి ఏం చేయలేదని అంటున్నారు. ఎన్నికల టైంలో తప్ప మిగిలిన టైంలో ప్రజల దగ్గరకు వెళ్లరనే అభిప్రాయం ఉంది. వైసీపీ అభ్యర్థిపై వ్యతిరేకత టీడీపీకి కలిసిరావొచ్చు.

ప్రొద్దుటూరు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా వరుసగా మూడో సారి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టికెట్ దక్కింది. ఇన్‌చార్జ్ ప్ర‌వీణ్‌రెడ్డిని చంద్రబాబు పక్కనపెట్టారు. దీంతో వైసీపీ శిబిరాన్ని అలర్ట్ చేసింది. వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిని అభ్య‌ర్థిగా ప్రకటించడం టీడీపీ తీసుకున్న గొప్ప నిర్ణయం అనే చెప్పాలి. 80 ఏళ్లు దాటినా.. ఉత్సాహంగా జనంలో తిరుగుతున్నారు. అటు, వైసీపీ నుంచి వలసలు కూడా పెరిగాయి. కాబట్టి ప్రొద్దుటూరు టీడీపీ ఖాతాలో పడటం ఖాయంగా తెలుస్తోంది.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో కూడా రాజకీయాలు అనూహ్యంగా మారాయి. టీడీపీతో బీజేపీ పొత్తు ఇక్కడ వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు కనుక.. తెలుగు తమ్ముళ్లు కూడా ఆయనకు సహకరిస్తున్నారు.

కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పెనుపెన్నడూ లేదని విధంగా రాజకీయాలు ఉన్నాయి. వైసీపీ త‌ర‌పున మూడోసారి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, టీడీపీ నుంచి ఆర్‌.మాధ‌వీరెడ్డి బ‌రిలో ఉన్నారు. అంజాద్‌బాషా బంధువుల ఓవరాక్షన్ వైసీపీని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. సొంతపార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కానీ, టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండంటం ఇక్కడ వైసీపీకి అనుకూలంగా మారింది. ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ. సీఏఏ అమలు కావడం వలన బీజేపీపై వ్యతిరేకతతో వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉంది.

కడప జిల్లాలో వైసీపీ రాజంపేట అభ్యర్థిని మాత్రమే ఈసారి మార్చింది. సిటింగ్ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డిని కాద‌ని జెడ్పీ చైర్మ‌న్ ఆకేపాటి అమ‌ర‌నాథ్‌రెడ్డికి సీటు ఇచ్చారు. మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి తమ్ముడికి రాజ్యసభ ఇచ్చారు. దీంతో.. మేడా వర్గం నుంచి పెద్దగా అసంతృప్తి ఉండే అవకాశం లేదు. అయితే.. పాలనా పరమైన నిర్ణయాలు ఇక్కడ వైసీపీని వ్యతరేకంగా మారే అవకాశం ఉంది. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన రాజంపేట‌ను కాద‌ని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైల్వేకోడూరులో వైసీపీ నుంచి కొర‌ముట్ల శ్రీ‌నివాసులు పోటీ చేస్తున్నారు. రైల్వేకోడూరు రాజంపేట‌ను ఆనుకొని ఉంటుంది. దీంతో.. రాజంపేటను జిల్లా కేంద్రం చేయలేదనే అసంతృప్తి ఇక్కడ కూడా ఉంది. దీంతో వైసీపీకి ఎదురు గాలి వీస్తుంది. అయితే ఇక్కడ టీడీపీ ఇంఛార్జిగా రూపానంద‌రెడ్డిని నియమించారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. అటు, జనసేన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తుంది. దీంతో.. కూటమిలో ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి రైల్వే కోడూరు పోలింగ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.

రాయ‌చోటి నుంచి వైసీపీ అభ్యర్థిగా గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ఉన్నారు. ఆయనకు టికెట్ రాదనే ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యం ఆయన పేరే ప్రకటించారు. రాయచోటిని జిల్లాగా ప్రకటించడం కొంత వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వాన్ని ఎదగనీయలేదనే అపవాదు ఉంది. ముస్లిం నాయకులను దూరం చేసుకున్నారు. సొంతంగా ఎవరి ఎలాంటి పనులు చేయలేదు. ప్రభుత్వం సంక్షేమం ఆయన్ని గెలిపించాలి తప్పా ఆయన మాత్రం పూర్తిస్థాయిలో నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించ ‌లేక‌పోయారు. టీడీపీ నుంచి మండిప‌ల్లె రాంప్ర‌సాద్‌రెడ్డి నిల‌వ‌నున్నారు. ఈయ‌న కుటుంబానికి రాజ‌కీయ నేప‌థ్యం వుంది. రాంప్ర‌సాద్‌రెడ్డి దివంగ‌త నాగిరెడ్డి రాయ‌చోటి ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. ఆ కుటుంబ నేపథ్యం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ తరుపున పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇద్దరూ వరుసగా మూడోసారి తలపడుతున్నారు. మైదుకూరు నియోజవకర్గానికి రఘురామిరెడ్డి చేసిందేమీ లేదు. ఇక్కడ ప్రజలు రఘురామిరెడ్డికి ఓటు వేయడానికి బలమైన కారణం కూడా లేదు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ మంచి వ్యక్తి అనే పేరుంది. కానీ, ఆయన తన సామాజిక వర్గాన్నిమినహా మిగిలినవారిని కలుపుకుపోలేడు అనే అపవాదు ఉంది. అందుకే మిగిలిన సామాజిక వర్గాలు ఆయన్ని వ్యతరేకిస్తాయి. ఆయన్ని వైసీపీ అభ్యర్థి గెలుపుకు ఇదే కారణం. చివరి వరకూ పుట్టా గెలుపు తప్పదనే ప్రచారం జరుగుతుంది. కానీ.. రఘురామిరెడ్డి గెలుస్తారు. ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన సింపతీ ఉంది. కాబట్టి ఈసారైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారేమో చూడాలి. ఈసారి గెలిచి తీరుతామని టీడీపీ అధిష్టానం బలంగా నమ్ముతుంది.

బద్వేలు నుంచి వైసీపీలో డాక్టర్ సుధా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందురెడ్డి, మరో నేతకు విశ్వనాథరెడ్డి మధ్య వర్గపోరు నడుస్తుంది. అందుకే ఇద్దరికి టికెట్ కాదని జగన్ డాక్టర్ సుధాకు టికెట్ ఇచ్చారు. డాక్టర్ సుధాను గెలిపించే బాధ్యత గోవిందురెడ్డి, విశ్వనాథరెడ్డి ఉన్నారు. టికెట్ దక్కలేదని రెండు వర్గాల్లో కోపం ఉంది. మరోవైపు ప్రత్యర్థికి కూడా దక్కలేదు కదా? అనే సంతృప్తి కూడా ఉంది. ఇరువర్గాలు పని చేస్తే వైసీపీ గెలుపునకు అవకాశం ఉంది. అది కూడా కూటమి తరుఫున టీడీపీ పోటీ చేస్తే పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. బీజేపీ కూడా టికెట్ ఆశిస్తుంది. కాబట్టి బీజేపీ పోటీ చేస్తే వైసీపీకే అవకాశం ఎక్కువ. అయితే, టీడీపీకే వస్తుందనే ఆశతో రోశన్న జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఒక కడప ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరుఫున మరోసారి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి కడపలో ఆసక్తికర పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరుఫున షర్మిల పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పోరు నువ్వా, నేనా అన్నట్టు ఉంటుంది. అన్ని పార్టీలు షర్మిలకు లోపాయికారి సపోర్టు చేయవచ్చు. దానికి తోడు వివేకాహత్యకేసు ప్రభావం ఈసారి బలంగా ఉంటుంది. దీంతో.. అవినాష్ రెడ్డి గట్టెక్కాలంటే సర్వశక్తులు ఒడ్డాలి. సామదానభేదదండోపాయాలు ప్రయోగించాల్సి ఉంటుంది. అవినాష్ రెడ్డికి అధికారులు కూడా సహకరిస్తే గట్టెక్కొచ్చు. లేదంటే కష్టమే.

రాజంపేటలో కూడా ఈసారి ఆసక్తికరంగా ఉంటుంది. ఎంపీ మిథున్ రెడ్డి బరిలో ఉంటారు. కూటమి అభ్యర్థికి నల్లారికిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి ఆపరేషన్ పిఠాపురంలో ఉన్నారు. పవన్ ను ఓడించేందుకు పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారు. రాజంపేటలో ఆయన ప్రత్యర్ధి కూడా బలమైన వ్యక్తి కావడంతో మిథున్ రెడ్డి కూడా సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -