YSRCP: ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ మంత్రి జిమ్మిక్కులు.. భారీ కుట్రకు తెర లేపారుగా!

YSRCP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్ వెలబడటమే కాకుండా ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఇలా ఎన్నికలకు కోడ్ అమలలోకి వచ్చినప్పటికీ కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పెద్ద ఎత్తున జిమ్మిక్కులు చేస్తూ భారీ స్థాయిలో నగదు బదిలీలను చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశంతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ కుట్రకు తెర లేపినట్లు తెలుస్తుంది.

సర్వేపల్లి నియోజకవర్గం వర్గ అభ్యర్థిగా ఎంపిక అయినటువంటి గోవర్ధన్ రెడ్డి అక్కడ గెలుపొందాలని ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఎన్నికల విధుల్లో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోలుగా ఏళ్ల తరబడి అక్కడే విధులు నిర్వర్తించే వారికే బాధ్యతలు అప్పగించారు. ఇక వీరందరూ కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావటం గమనార్హం.

మంత్రి కాకాణి వద్ద పని చేస్తున్న ఓఎఎస్డీ, పీఎస్‌లు ఇప్పటికీ రిలీవ్ అవలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే వైసీపీ నేతల్లాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. అధికారుల పర్యవేక్షణలోనే ప్రతి వాలంటీర్‌కు ఏకంగా ఐదు వేల రూపాయలు చొప్పున నగదు బదిలీలను కూడా పంపిస్తున్నారు. ఇలా స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులే వైసిపికి అనుకూలంగా మారి డబ్బులను పంపిణీ చేస్తూ భారీ కుట్రలకు తెర లేపారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -