Kanna Lakshminarayana: త్వరలో జనసేనలోకి మాజీ మంత్రి.. పవన్‌తో పూర్తైన చర్చలు

Kanna Lakshminarayana: ఏపీలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో పార్టీలన్నీ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తోన్నాయి. ఎవరి వ్యూహల్లో వారు మునిగిపోయారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోండగా.. జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఇప్పటినుంచే ఏకతాటిపై వస్తున్నాయి. ఇప్పటిక టీడీపీ, జనసేన ఒక్కటవ్వగా.. త్వరలో వాపక్షాలు కూడా కలిసే అకకాశముంది. బీజేపీ మాత్రం తన స్టాండ్ నుఇంకా చెప్పడం లేదు. టీడీపీ, వైసీపీలకు తాము దూరమని బీజేపీ చెబుతోంది.

అయితే ఎన్నికలు సమీపిస్తుండటం రాజకీయ నేతలు కూడా పోటీలోకి దిగేందుకు సీటు కోసం ప్రయత్నాలు చేస్తోన్నారు. అందుకోసం పార్టీలు మారేందుకు చర్చలు జరుపుతన్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కండువా మార్చేందుకు మంతనాలు జరుపుతున్నారు. త్వరలో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరనున్నారని సమాచాారం. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు లేకపోవడంతో ప్రస్తుతం ఏపీలో బలపడుతున్న జనసేన వైపు ఆయన అడుగుల వేస్తోన్నట్లు తెలుస్తోంది. తాజాగా గుంటూరులో తన అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ భేటీ నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో చర్చ జరిపారు. అనంతరం జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశరాు. కానీ ఆ తర్వాత ఆయనను పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు కేంద్ర అధినాయకత్వం పగ్గాలు అప్పగించింది. కానీ సోము వీర్రాజు తనను కలుపుకుని పోవడం లేదని, ముఖ్య నిర్ణయాల్లో తనను సంప్రదించకుండా ఏకపకక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత ఆయనకు ఎలాంటి పదవి అప్పగించలేదు. దీంతో ఆయన బీజేపీకి అంటీముంటన్లుగానే ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొనడం లేదు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత జాతీయ స్థాయలో ఏదైనా పదవి ఇస్తారేమోనని భావించారు. కానీ ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ పక్కన పెట్టింది. దీంతో బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. త్వరలో జనసేనలో చేరడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ తో సంప్రదింపులు జరిపారని, త్వరలోనే చేరుతారని టాక్ వినిపిస్తోంది. గుంటూరులో కన్నాకు అనుచరగణం ఉంది. గతంలో గుంటూరు జిల్లా పెదకూరపాటు నియోజకవర్గం నుంచి 4 సార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో గుంటరు పవ్చిమ నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు.

2014లో కాంగ్రెస్ తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన వైసీపీలో చేరుతున్నట్లు గుంటూరులో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కానీ చివరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఫర్ చేయడంతో వైసీపీలో చేరకుండా కన్నా లక్ష్మీనారాయణ వెనక్కి తగ్గారు.

మొత్తం ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలలో మంత్రిగా కూడా పనిచేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఆయనకు గుంటూరులో బలమైన నేతగా ఉన్నారు. కాపు సామాజికవర్గంలో కూడా ఆయనను పేరు ఉంది. దీంతో జనసేనలో చేరి వచ్చే ఎన్నికల్లో గుంటూరులోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Bhuvaneshwari-Brahmani: భువనేశ్వరి, బ్రాహ్మణి విషయంలో సీఐడీ స్కెచ్ ఇదేనా.. వాళ్లకు ఇబ్బందులు తప్పవా?

Bhuvaneshwari-Brahmani: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు పీఠాన్ని ఎక్కిస్తే, ఆ పదవిని కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవటానికి వాడుకుంటున్నారు నేటి మంత్రులు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేస్తున్నాడు. తనను అన్యాయంగా కేసులో...
- Advertisement -
- Advertisement -