Karate Kalyani: నడిరోడ్డుపై బట్టల్లేకుండా చేసిన భర్త..పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న నటి

Karate Kalyani: తెలుగు చలన చిత్ర నటీమణుల్లో కరాటే కళ్యాణి కూడా ఒకరు. ‘కృష్ణ’ సినిమాలో ఆమె చెప్పిన ‘బాబీ’ డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యారు. బ్రహ్మానందంతో ఆమె పండించిన కామెడీ అద్బుతమని చెప్పాలి. కరాటే కళ్యాణి గతంలో సినిమాల్లో చేసిన కొన్ని సన్నివేశాలను ప్రస్తావిస్తూ చాలా మంది ఆమెను చులకనగా చూసేవారు. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడేవారు. ఆమె చేసిన క్యారెక్టర్ల గురించి తప్పుగా చర్చించుకునేవారు. అయితే తాను బతకడానికి మాత్రమే అలాంటి పాత్రలు వేశాను తప్పా తనది అలాంటి క్యారెక్టర్ కాదని ఆమె పలు సందర్భాల్లో తెలిపారు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరాటే కళ్యాని మాట్లాడుతూ తన గురించి బయట మాట్లాడుకునే మాటలను గుర్తుకుతెచ్చుకుని భావోద్వేగమయ్యారు. తన పెళ్లి గురించి, తన భర్త గురించి ఆమె కొన్ని విషయాలను పంచుకున్నారు. సంసార జీవితంలో తాను చాలా బాధలు అనుభవించానని, తన భర్త పెట్టే టార్చర్ ను భరించలేకపోయేదాన్ని అని తెలిపారు. బేగంపేట నడి రోడ్డుపై తన భర్త పైట లాగి ద్రౌపది వస్త్రాభరణం చేశాడని, కొట్లాటలు, తాగి తన్నడం వంటివి ఎన్నో అనుభవించానని తెలిపారు.

 

రాత్రి 2 గంటలకు తాగేసి వచ్చి వండి పెట్టమన్నా తన భర్త కోసం వండిపెట్టేదాన్ని అని, కానీ తనను ఎన్నో రకాలుగా తన భర్త హింసించాడని, అందుకే పెళ్లి మీదే విరక్తి కలిగిందని తెలిపింది. తన తండ్రి చనిపోయిన తర్వాత తల్లి, చిన్న తమ్ముడితో ఉంటున్నానని, తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయేదాన్ని అని తెలిపారు.

 

ప్రస్తుతం తన చిన్న తమ్ముడికి 22 ఏళ్లని, అతను కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తోడుగా ఎవరుంటారని అమ్మ ఏడుస్తున్నట్లు తెలిపారు. తన తల్లి కోరిక మేరకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అందుకే పెళ్లి విషయంలో తాను ఇంకా ఆలోచనలోనే ఉన్నానని తెలిపారు. విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అన్నారు. తనపై జనాలు ఏవేవో కామెంట్లు చేస్తున్నారని, తన బాధ ఏంటో జనాలకు తెలియదని అన్నారు. సెలబ్రిటీగా ఎంత పేరొస్తే అంతలా నెగిటివిటీ, ట్రోలింగ్స్ పెరుగుతాయని, అందుకే అన్నింటినీ భరిస్తూ పోరాడుతూ ముందుకు వెళ్తున్నానని కరాటే కళ్యాణి తెలిపారు. బాబీ అనే డైలాగ్ చెప్పడం తప్పుకాదని, తన భృతి కోసం పైట జారిస్తే తప్పెందుకయ్యిందని ఆమె కన్నీటిపర్యంతమైంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -