Kasturi: ప్రభాస్ గురించి కస్తూరి దారుణమైన సెటైర్లు.. ఏం జరిగిందంటే?

Kasturi: రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఎంతో ఘనంగా తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పోస్టర్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు కొందరు సినిమాపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ రాముడిలా అసలు కనిపించడం లేదంటూ ఈయన గెటప్ పై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాముడు లక్ష్మణులకు మీసాలు గడ్డాలు ఉండడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.ఈ విధంగా ప్రభాస్ లుక్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో తాజాగా నటి కస్తూరి శంకర్ సైతం ఈ సినిమాలోని రాముడి పాత్ర పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 

రామలక్ష్మణులను మీసాలు గడ్డాలతో చూపించడం ఏంటి ఇలాంటి సాంప్రదాయం ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి కలవర పెట్టే పాత్రలను ఎందుకు సృష్టించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది లెజెండ్స్ శ్రీరాముడి పాత్రలో నటించారు. వారందరిని తెరపై చూస్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని చూసిన భావన కలుగుతుంది కానీ ప్రభాస్ ని చూస్తుంటే మాత్రం శ్రీరాముడిలా లేరని ఆయన కర్ణుడిలా ఉన్నారు అంటూ ఈ సందర్భంగా కస్తూరి శంకర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

ఇక ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు కస్తూరి శంకర్ మాటలకు మద్దతుగా నిలబడగా మరికొందరు మాత్రం ప్రభాస్ మీసాలు గడ్డలతో ఉన్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ రాముడి పాత్ర గురించి కస్తూరి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -