Kalvakuntla Kavitha: ఆ ఒక్క రీజన్ వల్లే కవిత అరెస్ట్ ఆగిందా.. ఏమైందంటే?

Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కల్వకుంట్ల కవిత ఎన్నో ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా సిబిఐ విచారణకు కూడా వెళ్లి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇదివరకు ఎంతోమంది అరెస్ట్ అయ్యారు కానీ కవిత మాత్రం అరెస్టు కావడం లేదు. ఇలా ఈమె అరెస్ట్ కావడం వెనుక రాజకీయ కోణం ఉందని పలువురు భావిస్తున్నారు. కవిత స్కామ్ చేశారని లంచాలిచ్చారని.. వచ్చిన డబ్బులతో బినామీ భూములు కొన్నారని ఈడీ సాక్ష్యాలు కూడా కోర్టుకిచ్చింది. కానీ అరెస్టు గురించి మాత్రం ఆలోచన చేయడం లేదు.

కవితను గతంలో ఈడీ కార్యాలయానికి పిలిచి నాలుగు సార్లు ప్రశ్నించారు. ఆమెకు చెందిన పది ఫోన్లను తీసుకున్నారు. తర్వాత మళ్లీ పిలుస్తామని నోటీసులు ఇచ్చారు కానీ పిలువలేదు. అందర్నీ అరెస్ట్ చేసికేవలం కవితకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు ఇలా ఈమెను అరెస్టు చేయకపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. అయితే కవిత ఈ డి విచారణ జరిగిన తర్వాత బిజెపి పట్ల వ్యతిరేకంగా మాట్లాడే విధానాన్ని కేసీఆర్ చాలా వరకు తగ్గించారని తెలుస్తుంది.

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఈ ఎన్నికలలో కేసీఆర్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు ఇక మహారాష్ట్రలో కూడా ఏదో నామ మాత్రంగా తన బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇదంతా బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి.. ప్రజల్లో బీఆర్ఎస్,బీజేపీ ఒకటే అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కారణం అవుతున్నాయన్న ఆందోళనలలో బిజెపి నేతలు ఉన్నారు.

 

కారణం ఏదైనా కేసీఆర్ బీజేపీపై దాడిని తగ్గించారు. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు స్లో కావడం.. మరో వైపు బీజేపీ కేసీఆర్ దాడిని తగ్గించడంతో బీజేపీ, బీఆర్ఎస్ రాజీ చేసుకున్నాయాఅనే అభిప్రాయాలు ప్రజలలో కలుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఈ ప్రభావం తెలంగాణలోని కెసిఆర్ పార్టీ నుంచి బిజెపి పార్టీలోకి వెళ్లిన నేతలను తీవ్ర అసహనానికి గురి చేస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా కవిత ఫారెస్ట్ ఆగిపోవడం వెనుక టిఆర్ఎస్ బిజెపి రాజీ కావడమే కారణమని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -