Kavitha: కవిత ప్రవర్తనకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే?

Kavitha: ఎమ్మెల్సీ కవిత గురించి మనందరికీ తెలిసిందే. ఈమె నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజా క్షేత్రంలో బిజీబిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఒక మొక్కజొన్న కంకులు అమ్మే మహిళతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తాజాగా ఎమ్మెల్సీ కవిత వివిధ కార్యక్రమాల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాసేపు ఆగారు.

రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఒక మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. అంతేకాదు మొక్క జొన్న కంకులు అమ్మే కొమురమ్మతో కవిత మాట కలిపారు. సీఎం కేసీఆర్‌ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నాటి పాలనకు కేసీఆర్ సార్ పాలనకు ఉన్న తేడాను కొమురమ్మ వివరించింది. తనకే కాదు ఇంటింటికి పింఛన్, పలు సంక్షేమ పథకాలు కేసీఆర్ సార్‌ ఇస్తున్నాడు అని కొమురమ్మ సంతోషంగా చెప్పింది. స్వయంగా సీఎం కేసీఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న కంకి కొనుగోలు చేయడంతో పాటు మాట కలపడంతో కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 

మరోవైపు ఎమ్మెల్సీ కవితను చూసిన స్థానిక వాహనదారులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకోగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత. అందుకు సంబందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలామంది కవితకి ఉన్న సింప్లిసిటీని చూసి మెచ్చుకుంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -