Kavitha: కవిత విషయంలో ఆ అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారా?

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కల్వకుంట్ల కవితాన్ని ఈడీ అధికారులు ఇదివరకే విచారించిన విషయం మనకు తెలిసిందే.కవిత విషయంలో సీబీఐ చాలా ఉదారంగా ఉంటోంది. ఆమెను ప్రశ్నించిన వారి జాబితాలోనూ చూపించడం లేదు. కానీ ఈడీ మాత్రం.. ఎక్కడ అవకాశం వచ్చినా కవిత పాత్రపై బలంగా ఆధారాలతో సహా కోర్టుల్లో కౌంటర్లు వేస్తోంది. వారం రోజుల క్రితం సిబిఐ వేసిన కౌంటర్లో కవిత ప్రస్తావన అసలు తీసుకు రాలేదని తెలుస్తుంది.

ఇకపోతే తాజాగా పిళ్లై బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో మాత్రం మొత్తం కవితే చేశారన్నట్లుగా కౌంటర్ వేశారు. ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడి దారి అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్‌‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది.

 

ఇండో స్పిరిట్ (ఎల్1)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించినట్లు అరుణ్ రామ చంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఆధారంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ కవితల మధ్య అవగాహన ఉందని తెలియజేశారు.ఇలా ఈయన మాటలను ఆధారంగా చేసుకుంటే కనుక కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇబ్బందులలో పడబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అయినా కవిత విషయంలో మాత్రం అధికారులు రెండు ధోరణిలతో వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సి.బి.ఐ మాత్రం కవితకు సపోర్టివ్ గా వ్యవహరించగా ఈడీ మాత్రం అవకాశం దొరికితే కవితను ఇరికించే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -