RRR: ఆర్ఆర్ఆర్ సాంగ్ పై కీరవాణి తండ్రి సంచలన వ్యాఖ్యలు వైరల్!

RRR: ఆర్ఆర్ఆర్ మూవీ మన దేశంతోపాటు ఇతర దేశాల్లో సైతం సంచలనం సృష్టించింది. మరో వారం రోజుల్లో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడం గ్యారంటీ అని సినీ ప్రియులు భావిస్తున్నా రు. ఈ అవార్డుల ఫంక్షన్ పాల్గొనేందుకు ఆర్ఆర్ఆర్ టీం సైతం ఎంతో కష్టపడుతోంది. నాటు నాటు సాంగ్ లో చరణ్, తారక్ వేసిన స్టెప్పులు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నా యని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే కీరవాణి తండ్రి శివశక్తిదత్తా మాత్రం ఆర్ఆర్ఆర్ గురించి సంచలన వ్యా ఖ్యలు చేశారు.

తనకు ఆర్ఆర్ఆర్ మూవీ కంటే బాహుబలి ఇష్టమని శివశక్తి దత్తా అన్నారు. బాహుబలి సినిమాలోని మెజారిటీ సాంగ్స్ నేనే రాశానని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాల కోసం సంస్కృతంలో పాటలు రాసే వ్యక్తిని తాను మాత్రమేనని శివశక్తిదత్తా వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ మూవీ క్లైమాక్స్ లో వచ్చే రామం రాఘవం సాంగ్ ను రాసింది నేనేనని ఆయన చెప్పుకొచ్చారు.

 

ఆ సాంగ్ కు ఆకట్టుకునే విధంగా ట్యూన్ ఇవ్వలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సై సినిమాలోని నల్లా నల్లాని కళ్ల పిల్లా సాంగ్ కూడా నాదేనని నేను ఎప్పుడో ఇష్టంతో రాసుకున్న ఆ సాంగ్ ను రాజమౌళి సై సినిమాలో పెట్టారని శివశక్తిదత్తా పేర్కొ న్నారు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు తమ సినిమాలలో పాటలు రాయాలని నన్ను ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన పేర్కొన్నారు.

 

తొమ్మిది పదుల వయస్సులో కూడా యాక్టివ్ గా కనిపిస్తున్నశివశక్తిదత్తా మీడియాకు కూడా దూరంగా ఉంటారు. రాజమౌళి సినిమాల ఈవెంట్లలో కూడా ఆయన ఎక్కువగా కనిపించడం లేదు. తమ కుటుంబంలో రాజమౌళికి మాత్రమే హీరో లుక్స్ ఉన్నాయని, అయితే రాజమౌళికి యాక్టింగ్ పై ఆసక్తి లేదని ఆయనపేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -