Vijay Thalapathy: కెరీర్ మొదట్లో అవమానాలు ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్!

Vijay Thalapathy: సినీ ప్రియులకు కొలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ గురించి పెద్దగా పరిచయంకర్లేదు. విజయ్ తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విజయ్ కోలీవుడ్ అగ్రస్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ కు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరి అటువంటి తళపతి విజయ్ స్టార్ హీరోగా ప్రస్తుతం ఓ వెలుగు వెలుగు తున్నాడు. ఇక ఈ స్థాయికి రావడానికి విజయ్ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాడట. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. మొదటిగా విజయ్ తల్లిదండ్రులు ఒక సాధారణ కుటుంబానికి చెందినవారట. విజయ్ తల్లి సంగీతం నేర్పేదట. అలా ఎన్నో కష్టాలు పడి విజయ్ తండ్రి ఇండస్ట్రీలో దర్శకుడుగా అడుగు పెట్టాడు. ఇక విజయ్ తల్లి కూడా ఇండస్ట్రీలో చాలా పాటలు పాడింది.

విజయ్ తన ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత తనకు యాక్టర్ అవ్వాలని కోరిక పుట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే తమ తల్లిదండ్రులు ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ గా ఉన్నారు. కానీ విజయ్ ఎలా అయినా సినీ రంగంలో అడుగు పెట్టాలని పట్టుపట్టాడు. ఇక విజయ్ తండ్రి తన సొంత డైరెక్షన్లో 60 లక్షల అప్పుచేసి తన కొడుకుని నాలయ తీర్పు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

కానీ ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ అయింది. ఆ సమయంలో చాలామంది విజయ్ ను ట్రోల్ చేశారు. బండ ముఖం వాడు హీరో ఏంటి అని అన్నారట. అంతే కాకుండా తండ్రి దర్శకుడు అయితే కొడుకు హీరో అయిపోతాడా అని దెప్పి పొడిచారట. ఆ తర్వాత విజయ్ కుటుంబం చాలాకాలం కోలుకోలేకపోయింది. ఆ తర్వాత పట్టుదలతో విజయ్ తండ్రి ఏకంగా ఇల్లు అమ్మేసి సెంతురా పండి అనే సినిమాతో విజయ్ ని హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక విజయ్ ఫ్యామిలీ నష్టపోయిన ఆస్తిని కూడా ఆ సినిమాతో రాబట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

Bhuvaneshwari-Brahmani: భువనేశ్వరి, బ్రాహ్మణి విషయంలో సీఐడీ స్కెచ్ ఇదేనా.. వాళ్లకు ఇబ్బందులు తప్పవా?

Bhuvaneshwari-Brahmani: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు పీఠాన్ని ఎక్కిస్తే, ఆ పదవిని కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవటానికి వాడుకుంటున్నారు నేటి మంత్రులు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేస్తున్నాడు. తనను అన్యాయంగా కేసులో...
- Advertisement -
- Advertisement -