Diwali: భక్తులకు గమనిక: దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీస్తోత్రం ఇదే!

Diwali: దీపావళి.. చెడుపై మంచి సాధించిన రోజు. విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తరమైన పండుగ. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ నెల 24వ తేదీన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రజలు ఇప్పటికే ఏర్పాటు మొదలు పెట్టారు.

ఆయా నగరాల్లో దీపావళి పటాసుల స్టాళ్లు వెలిశాయి. ప్రజలు ఇప్పటి నుంచి టపాసులు, దీపావళి వేడుకకు కావాల్సిన సామన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజలకు దీపావళి పండుగ విశిష్టత, పౌరాణిక చరిత్ర, దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీస్తోత్రం గురించి తెలియదు. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరిస్తాడు. సత్యభామతో నరకాసురుడిని సంహరింపజేస్తాడు. నరకాసురుడి సంహారించినందుకు అందరూ పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకాసురుడు మరణించగా.. ఆ తర్వాతి రోజులు దీపాలు వెలిగించుకుని సంబరాలు జరుపుకున్నారు.

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీస్తోత్రం:

నమశ్రియై లోకథాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః

నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యె నమోనమః

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః!!

నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమో నమః

పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః!!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే

సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే!!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే

మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే!!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే

పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే!!

బుగ్యజుస్సామురూపాయై విద్యాయైతే నమోనమః

ఫలశ్రుతి:

ఇతిస్తుతాతథాదేమైః విష్ణు వక్షస్థ్సలాలయా

విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్

సురాసీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ

యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భం శితాయేనరాభువి

తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థనమువాప్నుయుః!!

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -