Diwali OTT Movies: ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ఓటీటీలో కొత్తగా 21 సినిమాలు స్ట్రీమింగ్

Diwali OTT Movies: దీపావళి పండుగ సీజన్ రానే వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ సినిమాలతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా చాలా వరకు సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దీపావళి కానుకగా జిన్నా, సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా, బ్లాక్ ఆడమ్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయ్యే మూవీల కంటే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలే అధికంగా ఉన్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకే డిమాండ్ పెరిగింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం కన్నా.. ఓటీటీలో ఇంట్లో కూర్చొని సినిమా చూడాలని అనుకుంటున్నారు. అలాగే మంచి టాక్ ఉంటేనే థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సినిమా కంటెంట్ భిన్నంగా, కొత్తగా ఉండాలి. అప్పుడే పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో కలెక్షన్లు రాబట్టవచ్చు. మరోవైపు థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసే వాళ్ల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ఏకంగా 21 సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా, సోనీ లివ్, జీ5, వూట్ వంటి వాటిల్లో కొత్త సినిమాల స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 20, 21వ తేదీల్లోనే 21 సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విడుదల చేశాయి.

ఆహా..

అన్ స్టాపబుల్ 2 – ఎపిసోడ్ 2

కవి సామ్రాట్ – తెలుగు

కపట నాటక సూత్రధారి – తెలుగు

పేట్టైకాలి – సిరీస్ 1(తమిళం)

బింబిసార – తెలుగు

ట్రిప్లింగ్ – సిరీస్ 3 (హిందీ)

అమెజాన్ ప్రైమ్..

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ – సిరీస్ 3 (హిందీ)

ది పెరిఫెరల్ – సిరీస్ 1 (ఇంగ్లీష్)

అమ్ము – తెలుగు, తమిళం

నెట్ ఫ్లిక్స్..

డిసెండెంట్ – ఇంగ్లీష్

నైరోబి హాఫ్ లైఫ్ – ఇంగ్లీష్

ట్వెంటీన్త్ సెంచరీ గర్ల్ – కొరియన్

28 డేస్ హాంటెడ్ – సిరీస్ 1 (ఇంగ్లీష్)

బార్బేరియన్స్ – సిరీస్ 2 (జర్మన్)

హై డాక్యుమెంటరీ సిరీస్ – ఇంగ్లీష్

ఫ్రమ్ స్క్రాచ్ – లిమిటెడ్ సిరీస్ (ఇంగ్లీష్)

ఓనీ థండర్ గాడ్స్ టేల్ – సిరీస్ (ఇంగ్లీష్)

సోనీలివ్..

ఒకే ఒక జీవితం – తెలుగు, తమిళం

హాట్ స్టార్..

లైగర్ – హిందీ

రాక్ స్టార్ – అనిరుద్ మ్యూజికల్ కాన్సర్ట్(తమిళం)

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -