Sharukh Khan’s Daughter: చీరలో కూతుర్ని చూసి మురిసిపోతున్న షారుఖ్.. ఏం చెప్పాడో తెలుసా?

Sharukh Khan’s Daughter: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించినా కూడా బాలీవుడ్ మీడియాలో ఫుల్ ఫోకస్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు సుహానా గ్లామరస్ డ్రెస్‌లో దర్శనమిస్తోంది. రీసెంట్‌గా మరోసారి ఆమె అందరినీ తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది.

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ విదేశాల్లో చదువు ముగించుకుని ఇటీవలే ఇండియాకు వచ్చేసింది. తాజాగా మరోసారి సుహానా ఖాన్ చీరకట్టులో మెరిసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎప్పుడూ బాలీవుడ్ పార్టీల్లో కనిపిస్తూ హల్‌చల్ చేస్తోంది. ఇటీవల దీపావళి వేడుకల సందర్భంగా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘దివాళి బాష్’ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుహానా చీర కట్టుకుని దీపావళి పార్టీకి సిద్ధమైంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంది.

అయితే ఈ ఫోటోలపై తండ్రి షారుఖ్ ఖాన్ స్పందించాడు. సోషల్ మీడియాలో కూతురి ఫోటోలు చూసి షారుఖ్ ఖాన్ మురిసిపోయాడు. ఫోటోలను తన రియాక్షన్‌ను బయట పెట్టాడు. కూతురు పెట్టిన పోస్టుకు కామెంట్ కూడా చేశాడు. శారీలో అందంగా కనిపిస్తున్న తన కూతురిని చూసి.. ‘ఈ శారీ నిజంగా నువ్వే కట్టుకున్నావా?’ అని ప్రశ్నించాడు.

దీనికి కూతురు సుహానా ఖాన్ కూడా రియాక్ట్ అయింది. ‘అమ్మ చీర కట్టింది.’ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తండ్రీకూతురు కలిసి.. తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలా వీరిద్దరి మధ్య క్యూట్ చాట్ జరిగింది. దీనికి సంబంధించిన చాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, సుహానా ఫోటోలకు లక్షన్నరకు పైగా లైక్స్ వచ్చాయి. అలాంటి వందలాది మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సుహానా అంతకు ముందు కూడా అందమైన తెల్లని లెహంగాను వేసుకుని కనువిందు చేసింది. వైట్ డ్రెస్స్ లో చెవులకు తెల్లటి జుంఖాలు కూడా ధరించింది. కాగా, ఈ ఫోటోల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

12
3

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -